|
Updated 7 :59 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు " జులాయి టీం కి తన శుభాకాంక్షలు తెలియజేసి " అంతటితో తన స్పీచ్ ని ముగించేసారు............అంతటితో ఆడియో వేడుక ముగిసింది
ఫ్రెండ్స్.....మేము అందించిన ' జులాయి' సినిమా ఆడియో విశేషాలు మిమ్మల్ని బాగా అలరించాయి అనుకుంటున్నాం.
Updated 7 :50 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి విచ్చేశారు , ఆయనతో పాటు త్రివిక్రమ్, తమన్నా, గణేష్ బాబు మరియు హరీష్ శంకర్ లు కూడా ఆడియో రిలీజ్ చేయడానికి స్టేజ్ మీదకు విచ్చేశారు.......
Updated 7 :47 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ అని, అతనికి పోటి అనేదే లేదని మరియు అతను ప్రజల మనస్సును గెలుచు కున్న ఒక గొప్ప వ్యక్తి అని " అల్లు అర్జున్ స్టేజ్ మీద చెప్పారు.........
Updated 7 :42 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టేజ్ మీదకొచ్చారు... ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ మరియు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతున్నారు.........
Updated 7 :22 PM
డా. దాసరి నారాయణ రావు గారు విచ్చేశారు..... ఈయన చేతులమీద జులాయి థియేటర్ ట్రైలర్ విడుదల చేస్తున్నారు..............
Updated 7 :18 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడే విచ్చేశారు.........అయన రాకతో ఆడియో వేడుక ప్రాంగణం మొత్తం ఈలలు, చప్పట్లతో మరియు అరుపులతో మారు మ్రోగిపోయింది..........
Updated 7 :15 PM
స్టేజ్ మీద ఘంటా శ్రీనివాస్ ఐదవ పాటని విడుదల చేయగా...... దేవి శ్రీ ప్రసాద్ బ్రదర్ మరియు గాయకుడు సాగర్, గాయని రేనిన ఈ పాటని ఆలపిస్తునారు......
Updated 6 :55 PM
బ్రహ్మానందం ఇప్పుడే ఆడియో వేడుక ప్రాంగణం లోకి విచ్చేశారు ..బ్రహ్మానందంకి అభిమానులనుంచి ఒక పెద్ద హీరోకి లబించే స్పందన లభించింది.......
సురేష్ బాబు గారు వేదిక మీద నాలుగవ పాటని విడుదల చేస్తున్నారు............
Updated 6 :50 PM
మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పుడే వేడుకకి విచ్చేశారు..... తమన్నా చాలా అందంగా ఉన్నారు........
Updated 6 :42 PM
ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల చిత్రంలోని మూడవ పాటని విడుదల చేయడానికి వేదిక మీదకి విచ్చేశారు............
Updated 6 :37 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సోదరుడు కావడం తనకి ఎంతో గర్వంగా ఉందని నాగబాబు అన్నారు. ఈ మాటకి ఆడియో ప్రాంగణం అంతా ఈలలు,చప్పట్లతో మారు మ్రోగిపోయింది ...................
ఇప్పుడు ప్రత్యేకంగా తయారుచేసిన త్రివిక్రమ్ వీడియో ప్రదర్శించబడుతోంది.....
Updated 6 :29 PM
ఇప్పుడే ప్రముఖ నిర్మాతలు కె.ఎల్ నారాయణ మరియు సురేష్ బాబు లు వేదికకు విచ్చేశారు......
Updated 6 :25 PM
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ వేదికకు చేరుకున్నారు..... మెగా బ్రదర్ నాగబాబు చిత్రం లోని రెండవ పాటను విడుదల చేయడానికి స్టేజ్ మీదకి విచ్చేశారు........
Updated 6 :11 PM
ప్రముఖ దర్శకుడు రాజమౌళి జులాయి చిత్రం లో మొదటి పాటను విడుదల చెయ్యడానికి వేదిక మీదకు వచ్చారు
Updated 6 :07 PM
హాస్యం పండిస్తూ అల్లు అర్జున్ వేదిక మీదకు వచ్చారు అల్లు అరవింద్ త్రివిక్రమ్ ను ఎందుకు ఈ చిత్రానికి "జులాయి" అని పేరు పెట్టారు అని అడిగారు
Updated 6 :03 PM
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక్కడికి చేరుకున్నారు. నిర్మాత రాధాకృష్ణ మరియు డి వి వి దానయ్య అల్లుఅరవింద్ కూడా వేదికను చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా వస్తారని అల్లు అరవింద్ ప్రకటించారు
Updated 6 :00 PM
గణేష్ బాబు,హరీష్ శంకర్ మరియు శ్రీను వైట్ల ఇక్కడికి చేరుకున్నారు
Updated 5 :54 PM
మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ ఇక్కడికి చేరుకున్నారు. సత్య మాస్టర్ అల్లు అర్జున్ పాటల మెడ్లీ ప్రదర్శన అభిమానులను ఆకట్టుకుంటుంది
Updated 5 :49 PM
నాగబాబు మరియు సాయి ధరం తేజ్ వేదికను చేరుకున్నారు నాగబాబు ఫిట్ గా కనిపిస్తున్నారు. అభిమానులను అలరించడానికి మిమిక్రి ప్రదర్శన జరుగుతుంది
Updated 5 :49 PM
ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రేక్షకుల కేరింతల మధ్య వేదికను చేరుకున్నారు. ఒక దర్శకుడికి ఇంత ఫాలోయింగ్ ఉండటం అద్భుతం
Updated 5 :37 PM
నిర్మాతలు బి వి ఎస్ ఎన్ ప్రసాద్ మరియు జెమిని కిరణ్ తో కలిసి వేదిక చేరుకున్న నటుడు బ్రహ్మాజీ
Updated 5 :30 PM
సుమతో కలిసి అలీ యాంకరింగ్ చేస్తున్నారు. చోటా .కే .నాయుడు మరియు హేమ ఇక్కడికి చేరుకున్నారు. సత్య మాస్టర్ మరియు బృందం ప్రదర్శనకు సిద్దమవుతున్నారు
Updated 5 :27 PM
వేదిక మీదకి సుమ వ్యాఖ్యాతగా ప్రవేశించింది
Updated 5 :20 PM
వేడుక ఇంకా అధికారికంగా ప్రారంభం అవ్వలేదు మెగా ఫ్యామిలీ పాటలను తెర మీద ప్రదర్శిస్తున్నారు జనంతో వేదిక మెల్ల మెల్లగా నిండుతుంది
Updated 5:15 PM
హలో ఫ్రెండ్స్ మీకోసం మేము మరి కొద్ది క్షణాల్లో జులాయి ఆడియో విడుదల కార్యక్రమ లైవ్ అప్డేట్స్ అందిస్తున్నాం....
Click here for 'Julayi' Audio Function English version live updates
|