123telugu.com
మగధీర
విడుదల తేది : 31 జూలై, 2009
123Telugu.com రేటింగ్ 3.75/5
యూసర్ రేటింగ్:
దర్శకుడు : రాజమౌళి
సంగీతం : కీరవాణి
నిర్మాత : గీతా ఆర్ట్స్
తారాగణం : రామ్ చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, శ్రీహరి, సునీల్, బ్రహ్మానందం, ముమైత్ ఖాన్, కిమ్ శర్మ, సలోని & హేమ ...

మగధీర సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వారి అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విదంగా మగధీరను రూపొందిచాడు ధర్శకుడు రాజమౌళి.

కథ : ప్రేమకు మరణం లేదు, ఎన్నియుగాలు అయిన ప్రేమ తన శక్తిని కోల్పొదు. రాజకుమారి(కాజల్), కాలభైరవుడు(చరణ్) ని ప్రేమిస్తుంది. అనుకోని సంఘటనల ఎదురై ప్రేమికులు దూరం అవుతారు. ఈ జన్మలో హీరో(చరణ్)కి అకస్మాతుగా కొన్ని భావాలు మొదలవుతాయి, ఆ భావాలూ ఏమిటి, నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏమి జరిగింది, ఈ జన్మకు ఆ జన్మకు గల సంభందం ఏమిటి, ప్రేమికులు ఏ విధంగా కలుసుకుంటారు.

నచ్చే అంశాలు : మొదటి సీన్ మనసును కదిలించే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజభవనం యొక్క అంధాలు ప్రేక్షకులకు ఒక అనుభూతిని కలిగిస్తాయి. సాంకేతిక అంశాలు సినిమా విజయానికి ధోహదపడే విధంగా ఉన్నాయి. సంగీతం ఫరవాలేదనిపించింది. ఫోటోగ్రఫీ బాగుంది. హీరొ సినిమా మొదటి భాగంలో క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. కాజల్ పర్వాలేదనిపించింది. కల(ఆర్ట్) చాలా సహజంగా, గొప్పగా ఉంది. పోరాట దృశ్యాలు ఫర్వలేధనిపించాయి.

నచ్చని అంశాలు : కాలబైరవుడి క్యారక్టర్ యొక్క వాయిస్ వల్ల నటనకి వాయిస్ తేడా చాలా స్పష్టం కనపడింది. దాని వల్ల క్యారెక్టర్ విలువ పడిపోయింది. షేర్కాన్(శ్రీహరి) ఈ జన్మ యొక్క క్యారక్టర్ చాలా పేవలంగా ఉంది. నాలుగు వందల సంవత్సరాల డ్రీమ్స్ మళ్ళి పనిచేయడం బాగాలేదు, ఎందుకంటే ఆ సీను చాలా ముఖ్యమైనది. ప్రేక్షకుల మూడ్ సడన్ గా మారిపోయింది.

నేను చెప్పేది : అంచనాలు లేకుడా సినిమాని ఒకసారి దైర్యంగా చూడవచ్చు

కొసమెరుపు : రాజభవనం అందాలు చూడాలంటే మగదీరను చూడండి

Click here for English Version Review by Aks

Click here for English Version Review by Pramod

Bookmark and Share - ప్రదీప్   


Legend:    5 - Flawless
                4 - Must Watch
                3 - One Time Watch
                2 - Wait for the DVD
                1 - Stay Away
» More Reviews