బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : శతమానం భవతి
Next
 
శతమానం భవతి : డిఫరెంట్ కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూ ఉండే హీరో శర్వానంద్, తాజాగా 'శతమానం భవతి' అన్న సినిమాతో సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'ఖైదీ నంబర్ 150', 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి రెండు భారీ సినిమాల మధ్యన వచ్చినా కూడా ఈ సినిమా అంచనాలకు మించి సూపర్ కలెక్షన్స్ సాధిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ అనే చెప్పాలి. ఎక్కడా అతికి పోకుండా కుటుంబమంతా ఆస్వాధించేలా ఆద్యంతం ఎమోషన్స్‌తో కట్టిపడేసేలా సన్నివేశాలను రాసుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కుటుంబ విలువల గురించి చెప్పే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఫ్యామిలీ డ్రామా అయినా కూడా సినిమాలో వీలైనంత మేర కామెడీ ఉండేలా చూడడం కూడా ఓ ప్లస్ పాయింట్‌గానే చెప్పాలి. నరేష్ కామెడీ బాగా ఆకట్టుకుంది.

 
పెద్దగా ట్విస్ట్‌లేమీ లేకుండా అన్ని ఫ్యామిలీ సినిమాల్లో కనిపించే కథనే చూస్తూ ఉన్నట్లనిపించడం మైనస్‌గానే చెప్పాలి. ఇక సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా లేకున్నా, ఫ్యామిలీ సినిమా ఫార్మాట్‌లో సాగిపోవడం కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. కొన్నిచోట్ల కావాలని ఇరికించిన కామెడీ సన్నివేశాలు అస్సలు ఆకట్టుకునేలా లేవు.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
బి సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
సి సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
తీర్పు : ప్రారంభం బాగుంది
 
Bookmark and Share