బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : సింగం 3
Next
 
సింగం 3 : 'సింగం 3'.. గత మూడు నెలలుగా సూర్య అభిమానులను ఎంతగానో ఎదురుచూయిస్తోన్న సినిమా. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ క్రేజీ సూపర్ హిట్ సీక్వెల్, వివిధ కారణాలతో వాయిదా పడుతూ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి వారంలో ఈ చిత్ర వసూళ్లు పర్వాలేదని స్థాయిలోనే ఉన్నా రెండవ వారంలో మాత్రం బాగా తగ్గాయి.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 4వ స్థానంలో ఉంది.
.
ప్లస్ పాయింట్స్ లో హీరో సూర్య నటన గురించి ముందుగా చెప్పాలి. అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఆయన నటన అద్భుత స్థాయిలోనే ఉంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎగ్రెసివ్ గా కనిపిస్తూ ఆయన చెప్పిన డైలాగులు, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శించిన ఎమోషన్ బాగున్నాయి. హీరోయిన్ శృతి హాసన్ గ్లామరస్ గా కనిపిస్తూనే మంచి నటన ప్రదర్శించింది, ముఖ్యంగా పాటల్లో తన అందాలతో కనువిందు చేసింది. విలన్ పాత్ర కూడా చాలా బలంగా ఉండి హీరో పాత్రకు చాలెంజింగా నిలబడింది. ఆ పాత్ర చుట్టూ దర్శకుడు అల్లిన నేపథ్యం ఆసక్తికరంగా అనిపించింది. అలాగే సెకండాఫ్ లో వచ్చే హెవీ యాక్షన్ సన్నివేశాలు చాలా పవర్ ఫుల్, రేసీగా ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి.

 
సినిమా బలహీనతల్లో ముందుగా చెప్పాల్సింది కథ గురించి. ఎప్పటిలాగే పోలీస్ ఆఫీసర్ నరసింహం ఒక కేసును ఛేదించే పనిలో విదేశాల్లో ఉన్న విలన్ తో పోరాడి అతన్ని ఓడించడం అనేది ఈ సినిమాలో కథ. రెండవ భాగం 'యముడు-2' లో కూడా ఇదే కథ ఉండటంతో ఇక్కడ ఒక మోస్తారుగా కూడా కొత్తదనమున్న అనుభూతి కలగలేదు. చాలా సన్నివేశాల్లో 'యముడు -2' కళ్ళముందు కదిలినట్టే అనిపించింది.

ఇక కొన్ని సన్నివేశాలైతే పూర్తిగా లాజిక్స్ కి అందకుండా కాస్త అయోమయానికి గురిచేశాయి. దీంతో సినిమాపై ఆసక్తి కొంచెం సన్నగిల్లింది. యముడు - 1, యముడు -2 సినిమాల్లోలాగే ఇక్కడ కూడా సిట్యుయేషనల్ కామెడీని పండించే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త బెడిసికొట్టి అస్సలు ఆకట్టుకోలేదు. పైగా సినిమా కథనానికి మధ్యలో అడ్డు తగులుతున్నట్టు అనిపించింది. ఇక సినిమాలో బాగా ఎక్కువ మోతాదులో ఉన్న యాక్షన్, ఛేజింగ్ ఎపిసోడ్లు ప్రేక్షకుడు తట్టుకునే స్థాయిని మించిపోయి కాస్త ఇబ్బంది పెట్టాయి.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : అంత బాగోలేదు.
 
బి సెంటర్స్ : అంత బాగోలేదు.
 
సి సెంటర్స్ : అంత బాగోలేదు.
 
తీర్పు: అంత బాగోలేదు.
 
Bookmark and Share