బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : నగరం
Back | Next
నగరం : గత కొన్నాళ్లుగా కెరీర్లో సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా 'నగరం' సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం తమిళ్, తెలుగు రెండు భాషల్లోనూ రిలీజై మంచి పాజిటివ్ టాక్ తో పాటు మంచి ఓపెనింగ్స్ కూడా సాధించి రెండో వారంలో యావరేజ్ టాక్ తో నడుస్తోంది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
సినిమాలోని అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే చెప్పుకోవలసింది ఆరంభం నుండి చివరి వరకు కొనసాగించబడిన సస్పెన్స్. దీని వలన తరువాతి సన్నివేశంలో ఏం జరుగుతుందో అనే ఉత్సుకత కొనసాగింపబడి ఎక్కడా ప్రేక్షకుడి ఆసక్తి సడలిపోలేదు. దర్శకుడు లోకేష్ తను రాసుకున్న మంచి స్క్రీన్ ప్లేని అద్భుతంగా తెరపై ఆవిష్కరించి కాస్త సంక్లిష్టమైన కథను అర్థమయ్యేలా వివరించాడు. సందీప్ కిషన్ కూడా హీరో ఇమేజ్ ను వదిలేసి ఒక నటుడిగా కథలోని పాత్రలో కలిసిపోయాడు. ఇక సెకండాఫ్ అంతా ఒక్కొక్క పాత్ర కథలో ఇన్వాల్వ్ అవుతూ చాలా బాగా తయారైంది.

 
హీరోయిన్ రెజినాకు కథలో అంతగా ప్రాధాన్యం లేదు. సినిమా కథనం బాగానే ఉన్న ఒక్కొక్క పాత్రను పరిచయం చేయడానికి, కథనంలో కుదురుకునేలా చేయడానికి దర్శకుడు మరీ ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. ఇలాంటి వేగవంతమైన కథనం ఉన్న సినిమాల్లో సన్నివేశాలు కూడా వేగంగానే ఉండాలి. కానీ ఇందులో కాస్త సాగదీసిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అలాగే ఫస్టాఫ్ బాగున్నా లెంగ్త్ కాస్త ఎక్కువైనట్టు తోచింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : బాగానే ఉంది
 
బి సెంటర్స్ : పర్వాలేదు
 
సి సెంటర్స్ : పర్వాలేదు
 
తీర్పు: యావరేజ్
 
Bookmark and Share