బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : నేనోరకం
Next
 

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో మొదలయ్యే సెకండాఫ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శరత్ కుమార్ హీరో సాయి రామ్ శంకర్ ను కంటికి కనిపించకుండా ఒక ఆట ఆడుకోవడం బాగుంది. సెకండాఫ్ మొత్తాన్ని శరత్ కుమార్, హీరో సాయి రామ్ శంకర్ లు తమ పెర్ఫార్మెన్స్ తో సక్సెస్ ఫుల్ గా నడిపారు. హీరోయిన్ రేష్మి మీనన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అందంగా ఉంది. సాయి రామ్ శంకర్, శరత్ కుమార్ పాత్రల మధ్య అతను నడిపిన డ్రామా సినిమాకే హైలెట్ గా నిలిచింది.


 
ఆరంభం నుండి ఇంటర్వెల్ ముందు వరకు హీరో హీరోయిన్ మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సీన్లు, కామెడీ సీన్లు మినహా మిగతా కథనం అంతా ఏదో సమయం గడపాలి కాబట్టి నడిపినట్టు ఉంది. ఎంఎస్ నారాయణ, వైవా హర్షల కామెడీ ఆరంభంలో బాగానే ఉన్న దాన్ని మోతాదుకు మించి సాగదీయడంతో ఒక దశలో చిరాకు కలిగింది. ఇక సెకండాఫ్ ఆరంభమయ్యే వరకు సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో ఫస్టాఫ్ నీరసంగా తయారైంది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : పర్వాలేదు
 
బి సెంటర్స్ : పర్వాలేదు
 
సి సెంటర్స్ : పర్వాలేదు
 
తీర్పు: యబో యావరేజ్
 
Bookmark and Share