బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : అభినేత్రి
Next
 
అభినేత్రి : సౌతిండియన్ సినిమాలో టాప్ హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోన్న తమన్నా, తాజాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన 'అభినేత్రి' అనే సినిమాతో అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో ఆమెదే ప్రధాన పాత్ర అవ్వడంతో సినిమాకు మొదట్నుంచీ మంచి క్రేజ్ వచ్చింది.


 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 4వ స్థానంలో ఉంది.
.
ఈ సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ ఏమిటంటే దర్శకుడు విజయ్ కథను చెప్పిన విధానం చాలా సింపుల్ గా ఉంది. హర్రర్ సినిమా కదా అని అనవసరమైన భయపెట్టే సన్నివేశాలను, భీకర సౌండ్ ఎఫెక్ట్స్ ను పెట్టకుండా మంచి పని చేశాడు. హర్రర్ ను కామెడీని సమానంగా బ్యాలన్స్ చేయడం అంత సులభం కాదు. అలా అది చేస్తే సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. ఇక్కడ అభినేత్రి విషయంలో దర్శకుడు అదే చేశాడు. ఎవరో ఆవహించిన తన భార్యను ఆవహించిన దెయ్యం చేత కంట్రోల్ చేయబడుతూ, తన భార్య సోనూ సూద్ తో ప్రేమలో పడకుండా చూసే నిస్సహాయ భర్తగా ప్రభుదేవా నటన బాగుంది. ఎప్పటిలా డాన్సులు బాగా చేశాడు.

 
హర్రర్ కామెడీ చిత్రం అని ప్రచారం చేయబడ్డ ఈ సినిమాలో ఆ ప్రచారానికి పూర్తి న్యాయం జరగలేదు. సినిమాలో నవ్వులు పండినా అవి కూడా పెద్ద మొత్తంలో లేవు. హర్రర్ కంటెంట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. కామెడీ చాలా సిట్యుయేషనల్ గా సాగింది. ఫస్టాఫ్ ముగిసే సమయానికి దెయ్యం రూబీ ఇంట్రడక్షన్ వస్తుంది. ఆ సమయంలో వచ్చిన వాయిస్ ఓవర్ అసలు అది హర్రర్ సన్నివేశం అనే భావాన్నే పోగొట్టింది. కథనం కాస్త రొటీన్ కావడంతో సినిమాలో ముందు ముందు ఏం జరగబోతోందో యిట్టె ఊహించవచ్చు. అలాగే ఫరా ఖాన్ అతిధి పాత్ర డబ్బింగ్ కూడా బాగోలేదు.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ఫర్వాలేదు
 
బి సెంటర్స్ : అంతబాగా ఆడటం లేదు
 
సి సెంటర్స్ : అంతబాగా ఆడటం లేదు
 
తీర్పు : యావరేజ్
 
Bookmark and Share