బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : ఇజం
Back | Start
 
ఇజం : పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో 'ఇజం' పేరుతో తెరకెక్కిన సినిమా అక్టోబర్ 21న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. మొదట్నుంచీ ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై మంచి అంచనాలు ఉండడంతో ఓపెనింగ్స్ బాగున్నాయి.


 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1వ స్థానంలో ఉంది.
.
సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయంలో ముందుగా చెప్పుకోవలసింది కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజన్స్, అతని పెర్ఫార్మెన్స్ గురించి. కళ్యాణ్ రామ్ తన ముందు సినిమాల్లో కన్నా ఇందులో చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు. అతని డైలాగ్ డెలివరీ, మ్యానరిజం, ఎమోషనల్ సన్నివేశంలో చూపించిన హావభావాలు చాలా బాగున్నాయి. కళ్యాణ్ రామ్ ను పూర్తిగా మార్చేసి కొత్తగా చూపిస్తూ పూరి ఇచ్చిన ఫ్రెష్ నెస్ చాలా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఎలివేషన్, పెర్ఫార్మెన్స్ తో బాగానే సాగిపోయింది.

 
సినిమాలోని మైన్స్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవలసింది సెకండాఫ్ గురించి. ఇందులో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మినహా మిగతా అన్ని సన్నివేశాలు ఊహాజనితంగానే ఉండి బోర్ కొట్టించాయి. అలాగే జావెద్ భాయ్ గా విలన్ జగపతిబాబుని మొదట్లో ఓ రేంజ్ లో చూపించి ఆ తరువాత పూరిగా తేల్చేశాడు. ఇక క్లైమాక్స్ లో అయితే ఇండియాలో జరుగుతున్న కరెప్షన్ కి అండగా నిలిచిన జగపతిబాబుని ఏమాత్రం నొప్పించకుండా ఫ్రీగా వదిలేయడం హీరో లక్ష్యాన్నే దెబ్బ తీసేదిగా ఉండి నిరుత్సాహపరిచింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
బి సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
సి సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
తీర్పు : ప్రారంభం బాగుంది
 
Bookmark and Share