బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : జెంటిల్‌మన్
Next
 
జెంటిల్‌మన్ : ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నాని నటించిన సినిమా ’జెంటిల్‌మన్’ జూన్ 17న పెద్ద ఎత్తున విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.


 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 4వ స్థానంలో ఉంది.
.
ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పాల్సింది డేవిడ్ నాథన్ అందించిన కథ, దర్శకుడు కథను నడిపిన విధానం. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కు ఏయే అంశాలు కావాలో అన్నింటినీ దర్శకుడు తన కథనంలో పొందుపరిచి ఊహించని మలుపులతో మంచి కిక్కే ఇచ్చాడు. అలాగే సినిమాలోని నాని రెండు పాత్రలను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రేక్షకుడికి చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమా మొదటి భాగంలో అప్పటి వరకూ ఉన్న నాని రెండు పాత్రల్లో ఒక పాత్రను చంపేయడంతో దర్శకుడు అసలు కథను మొదలుపెట్టిన విధానం బాగుంది.
 
సినిమాలోని మైనస్ పాయింట్స్ విషయానికొస్తే చెప్పుకోవలసింది 144 నిముషాల రన్ టైమ్. దర్శకుడు ఎంచుకున్న కథ బాగానే ఉన్నప్పటికీ ఆ కథను చెప్పడానికి మరీ అంత సమయం అవసరం లేదు. సినిమా నిడివి పెంచాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు మొదట్లో ప్రేమ జంటల మధ్య పెట్టిన అనవసరమైన కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టినట్టు అనిపించాయి.


 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : అంతబాగా ఆడటం లేదు
 
బి సెంటర్స్ : అంతబాగా ఆడటం లేదు
 
సి సెంటర్స్ : అంతబాగా ఆడటం లేదు
 
తీర్పు : హిట్
 
Bookmark and Share