బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : జ్యో అచ్యుతానంద
Next
 
జ్యో అచ్యుతానంద : దర్శకుడిగా మారి మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ అనే సినిమాతో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చారు. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి షో నుంచే అంతటా మంచి టాక్ తెచ్చుకుంది.


 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే ఎంతో క్లారిటీతో పక్కాగా రాసుకున్న స్క్రిప్ట్ అనే చెప్పాలి. చెప్పుకోవడానికి చాలా చిన్నదిగా, సింపుల్‌గా కనిపించే కథనే సినిమాగా మలచడంలో స్క్రీన్‌ప్లేతో చేసిన మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి ముప్పై నిమిషాలు ఒకే కథను రెండు కోణాల్లో చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ అదే కథను దర్శకుడి కోణంలో మొదలుపెట్టడం ఇవన్నీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చిపెట్టాయి. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ఈ ముగ్గురి మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. సెకండాఫ్‌లో నారా రోహిత్, నాగ శౌర్యల మధ్యన వచ్చే సన్నివేశాలు కథకు మంచి అర్థాన్ని తెచ్చిపెట్టాయి. సినిమా ఆద్యాంతం డైలాగులతో, సన్నివేశాల్లో వచ్చే కన్ఫ్యూజన్‌తో పుట్టించిన కామెడీ కట్టిపడేసేలా ఉంది.

 
ఈ సినిమాకు ఉన్నవాటిల్లో పెద్ద మైనస్ అంటే సెకండాఫ్‌లో రివెంజ్ తీర్చుకోవడం అంటూ రెజీనా పాత్ర చేసే డ్రామా అనే చెప్పాలి. తెలిసీ ఒక ఎంగేజ్‍మెంట్ ఒప్పుకొని, మళ్ళీ చెడగొడ్డడం లాంటివి కథ పరంగా కూడా అనవసరమైనవనే అనిపించింది.


 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : బాగా ఆడుతోంది
 
బి సెంటర్స్ : బాగానే ఆడుతోంది
 
సి సెంటర్స్ : ఫర్వాలేదు
 
తీర్పు : హిట్
 
Bookmark and Share