బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : నేను లోకల్
Next
 
నేను లోకల్ : వరుస విజయాలతో తిరుగన్నదే లేకుండా దూసుకుపోతోన్న హీరో నాని, ఫిబ్రవరి 3న 'నేను లోకల్' అంటూ వచ్చి మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకొని రెండవ వారంలో సైతం స్టడీ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద మాత్రం హిట్ గా నిలిచింది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 4వ స్థానంలో ఉంది.
.
సినిమాలోని ఆకట్టుకునే అంశాల్లో నాని క్యారెక్టరైజేషన్ ప్రధానమైనది. ఎప్పుడూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ అన్నింటినీ లైట్ గా తీసుకుని తాను అనుకున్నదే చేసే కుర్రాడు బాబు పాత్ర బాగుంది. ఆ పాత్రలో నాని నటన కూడా కొత్తగా ఉండి ఆకట్టుకుంది. నాని కనిపించిన ప్రతి సీన్ పంచ్ డైలాగులతో నిండి ఆహ్లాదకరంగా ఉంది. ఇక ఫస్టాఫ్ సినిమా మొత్తం నాని పాత్ర చుట్టూ తిరుగుతూ, సరదా సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోయింది. సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బలంగా ఉండి సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచింది.

 
మైనస్ పాయింట్స్ అంటే ముందుగా చెప్పాల్సింది సినిమా కథ గురించి. అన్ని పాత సినిమాల్లోలాగే ఈ స్టోరీ కూడా రొటీన్ గానే ఉంటుంది. ఎక్కడా కొత్తదనముండదు. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో వచ్చే కొన్ని సన్నివేశాలు రన్ టైమ్ ను పెంచడానికే తీసినట్టు అనిపించాయి.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : పర్వాలేదు
 
బి సెంటర్స్ : పర్వాలేదు
 
సి సెంటర్స్ : పర్వాలేదు
 
తీర్పు: హిట్
 
Bookmark and Share