సమీక్ష : “ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)” – కొన్ని చోట్ల ఆకట్టుకునే సర్వైవల్ డ్రామా!

The Goat Life Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 28, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్-లూయిస్, KR గోకుల్, తాలిబ్ అల్ బలూషి మరియు రిక్ అబీ తదితరులు

దర్శకుడు: బ్లెస్సీ

నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్-లూయిస్, స్టీవెన్ ఆడమ్స్

సంగీత దర్శకులు: ఏ ఆర్ రెహమాన్

సినిమాటోగ్రాఫర్‌: సునీల్ కె.ఎస్‌

ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

‘ఫ్యామిలీ స్టార్’ కి నేషనల్ క్రష్ బెస్ట్ విషెస్

యువ నటుడు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ల తొలి కాంబినేషన్ లో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా గోపి సుందర్ సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

విషయం ఏమిటంటే, తన స్నేహితుడు విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ పెద్ద విజయం అందుకోవాలని టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియచేసారు రష్మిక. ఏప్రిల్ 5 కోసం తాను ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నానని, తనకు ఇష్టమైన విజయ్, పరశురామ్ ల ఫ్యామిలీ స్టార్ తప్పకుండా విజయం అందుకుంటుందని, తనకు పార్టీ కావలని అంటూ ప్రత్యేకంగా హీరోయిన్ మృణాల్ కి కూడా రష్మిక విషెస్ తెలిపిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ పిక్ : తన మైనపు విగ్రహంతో అదరగొట్టే లుక్ లో ఐకాన్ స్టార్

టాలీవుడ్ స్టార్ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa The Rise) లో హీరోగా నటిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయ్ లో లాంచ్ చేయబడింది.

తన మైనపు విగ్రహాన్ని స్వహస్తాలతో లాంచ్ చేసిన అల్లు అర్జున్, దానితో పాటు స్టైలిష్ లుక్ లో అదరగొట్టారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలవైకుంఠపురములో మూవీతో కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ఆ తరువాత చేసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ తో నటుడిగా గొప్ప విజయం అందుకోవడంతో పాటు ఆ మూవీలో అద్బుత నటనకు గాను భారత ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మరింత ఆలస్యంగా ప్రారంభం కానున్న ప్రభాస్ ‘స్పిరిట్’ షూట్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రస్తుతం ది రాజా సాబ్ (The Raja Saab), కల్కి 2898 ఏడి (Kalki 898AD) మూవీస్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీటిలో నాగ అశ్విన్ తీస్తున్న కల్కి మే లో రిలీజ్ కానుండగా రాజా సాబ్ ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది.

ఇక దీని తరువాత త్వరలో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తెరకెక్కించనున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్పిరిట్ (Spirit) లో నటించనున్నారు ప్రభాస్. ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా టి సిరీస్ సంస్థ దీనిని భారీ స్థాయిలో నిర్మించనుంది. విషయం ఏమిటంటే, ప్రస్తుతం సందీప్ స్పిరిటి మూవీ స్టోరీ, స్క్రిప్ట్ సిద్దము చేసే పనిలో ఉన్నారు.

కాగా ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ మీదకు తీసుకువెళ్తారని ఇటీవల వార్తలు రాగా తాజా ఇండస్ట్రీ వర్గాల బజ్ ప్రకారం స్పిరిట్ మూవీ కొంత ఆలస్యంగా ఈ ఏడాది డిసెంబర్ లో పట్టాలెక్కుతుందని అంటున్నారు. త్వరలో ఈ మూవీలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడి కానున్నాయి.

‘టిల్లు స్క్వేర్’ : యుఎస్ఏ ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.

మంచి అంచనాలతో నేడు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఇప్పటికే ప్రీమియర్స్ ద్వారా 250కె డాలర్స్ గ్రాస్ సొంతం చేసుకుందని మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే చక్కని కాన్సెప్ట్ తో తెరకెక్కిన తమ మూవీ తప్పకుండా మంచి విజయం అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో కూడా బాగా బిజినెస్ చేయడంతో మంచి టాక్ లభిస్తే కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

‘విశ్వంభర’ : మెగాస్టార్, ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబో పై అందరిలో ఆసక్తి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ భారీ సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ విశ్వంభర. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని, చోటా కె నాయుడు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ అయితే టాలీవుడ్ ఆడియన్స్ లో బజ్ గా మారింది.

వాస్తవానికి మెగాస్టార్ తో కలిసి సంగీత దర్శకుడు కీరవాణి గతంలో అనేక సక్సెస్ఫుల్ మూవీస్ కి వర్క్ చేసారు. అయితే వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో చాలా ఏళ్ళ తరువాత ఈ మూవీ వస్తుండడంతో సాంగ్స్ ఎలా ఉంటాయో వినాలని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక విశ్వంభర కోసం కీరవాణి కూడా ఎంతో కష్టపడుతున్నారని, సాంగ్స్ తో పాటు బీజీఎమ్ కూడా అదిరిపోయేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు టాక్. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇకపై మరింత శ్రద్ధ, దీక్షతో మా కాంబో సినిమాలకు పనిచేస్తాము – ‘లెజెండ్’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో బోయపాటి శ్రీను

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నటసింహం బాలకృష్ణ హీరోగా రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన యాక్షన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్. సరిగ్గా ఇవాళ్టికి పదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయం అందుకోవడంతో పాటు ఒక థియేటర్ లో ఏకంగా మూడేళ్లు ఆడింది. ఇక నేటితో ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకోవడంతో హైదరాబాద్ లో మూవీ యూనిట్ ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, టాలీవుడ్ లో రియల్ లెజెండ్ ఒక్కప్పటి స్టార్ నటులు విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు గారు అని అన్నారు. అందుకే ఆయనని స్మరిస్తూ ఈ మూవీ ప్రారంభంలో చూపించడం జరిగిందన్నారు. ఇక ఈ సినిమా కోసం బాలకృష్ణ గారితో పాటు టీమ్ మొత్తం కూడా ఎంతో కష్టపడి పని చేసారని, అందుకే బాలయ్య ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మూవీకి విశేషమైన రెస్పాన్స్ లభించిందని, ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక పై తమ కాంబినేషన్ లో రానున్న సినిమాలకు మరింత శ్రద్ద, దీక్షతో పని చేస్తాం అని, బాలయ్యతో మరిన్ని సినిమాలు చేయాలనేది తన ఆలోచన అన్నారు బోయపాటి.

విశ్వక్ సేన్ 12 టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్, టైం ఫిక్స్

యువ నటుడు విశ్వక్ సేన్ ఇటీవల గామి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక త్వరలో ఆయన నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుండగా రేపు ఆయన కెరీర్ 12వ మూవీ యొక్క టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు.

విశ్వక్ బర్త్ డే రేపు కావడంతో ఈ స్పెషల్ డే సందర్భంగా షైన్ స్క్రీన్స్ సంస్థ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ గా నిర్వహించనున్న ఈ మూవీ యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ రేపు సాయంత్రం 4 గం. 5 ని. లకు రానుంది. ఆమె వరల్డ్ ని రేపు పరిచయం చేయనున్నాం అంటూ ఇంట్రెస్టింగ్ గా మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు రేపటి టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రివీల్ కానున్నాయి.

విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్!

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ (Viswak Sen) చివరిసారిగా గామి చిత్రం లో కనిపించారు. తన అద్భుతమైన నటనతో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకున్నారు. తదుపరి కృష్ణ చైతన్య దర్శకత్వం లో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం లో కనిపించనున్నాడు. నేహ శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది.

విశ్వక్ సేన్ తదుపరి SRT ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం లో నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ ను రేపు ఉదయం 11:11 గంటలకి రివీల్ చేయనున్నారు. అంతేకాక ఈ సినిమా కి సంబందించిన ఫస్ట్ లుక్ ను కూడా అదే టైమ్ కి రిలీజ్ చేయనున్నారు మేకర్స్. విశ్వక్ సేన్ కెరీర్ లో పదవ చిత్రంగా వస్తున్న ఈ సినిమా పై అందరిలో ఆసక్తి నెలకొంది.

“ఫ్యామిలీ స్టార్” బ్లాక్ బస్టర్ హిట్ కావాలని విష్ చేసిన మాళవిక మోహనన్!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family star). ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ రాగా, ట్రైలర్ తో సినిమా పై మరింత అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం ట్రైలర్ ను చూసిన హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika mohanan) సోషల్ మీడియా వేదిక గా చిత్త యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపింది. తన ఫ్యామిలీ స్టార్ K.U. మోహనన్ సినిమాను షూట్ చేశారు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి K.U. మోహనన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని విష్ చేశారు. అంతేకాక సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మృణాల్ ఠా కూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అనీల్ రావిపూడి – వెంకటేష్ మూవీ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో!

గతేడాది నందమూరి బాలకృష్ణ తో భగవంత్ కేసరి చిత్రం ను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ అనీల్ రావిపూడి. ఈ డైరెక్టర్ నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ ను డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం కి సంబందించిన లేటెస్ట్ ఇన్ఫో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం విలేజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోంది అని తెలుస్తుంది. ప్రతి చిత్రం లో డిఫెరెంట్ ఎలిమెంట్స్ ను చూపించే డైరెక్టర్ అనీల్, ఈ చిత్రం లో కూడా అలానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం కి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా, రెండు పాటలు పూర్తి అయ్యాయి అని సమాచారం. సినిమాను త్వరలోనే అనౌన్స్ చేసి, ఈ ఏడాది జూన్ లేదా జూలై లో షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

లేటెస్ట్ : సక్సెస్ఫుల్ గా 21 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 మూవీ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక మొదటి సినిమా గంగోత్రి నుండి నటుడిగా ఒక్కో మూవీతో తన ఆకట్టుకునే అభినయంతో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పిస్తూ దూసుకెళ్తున్న అల్లు అర్జున్ నేటితో నటుడిగా సక్సెస్ఫుల్ గా 21 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.

ఇక టాలీవుడ్ హీరోల్లో ఏ ఒక్కరికీ దక్కని ఘనత అల్లు అర్జున్ కి దక్కింది. పుష్ప 1 మూవీలో తన అత్యద్భుత నటనకి గాను భారత ప్రభుత్వం నుండి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా ఆయన అవార్డు అందుకోవడం విశేషం. ఈ విధంగా ఒక్కో సినిమాతో హీరోగా మరింత మంచి క్రేజ్ తో కొనసాగుతున్న అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మా 123 తెలుగు టీమ్ కోరుకుంటోంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చిన “105 మినిట్స్”

హీరోయిన్ హన్సిక ప్రధాన పాత్రలో, డైరెక్టర్ రాజు దుస్సా దర్శకత్వం లో తెరకెక్కిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 105 మినిట్స్. ఈ చిత్రం జనవరి 26, 2024 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.

ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. థియేటర్ల లో ఏ మాత్రం ఆకట్టుకొని ఈ థ్రిల్లర్ డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి నిర్మాత బొమ్మక్ శివ, సంగీత దర్శకుడు సామ్ సి ఎస్, సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిపాడు, ఎడిటర్ శ్యామ్ వడవలి లుగా వ్యవహరిస్తున్నారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘ఫ్యామిలీ స్టార్’ పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక నేడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ప్రస్తుతం దానికి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

విషయం ఏమిటంటే, నేడు ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ఈ మూవీ కోసం దర్శకుడు పరశురామ్, హీరో విజయ్ ఎంతో కష్టపడ్డారని అన్నారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుదని అలానే అన్ని వర్గాల ఆడియన్స్ కి కావాల్సిన యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కలగలిపిన పక్కా సమ్మర్ ప్యాకేజ్ తో గీతా గోవిందం మాదిరి భారీ సక్సెస్ మళ్లీ రిపీట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా”?

ఈ నగరానికి ఏమైంది చిత్రంలో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన అభినవ్ గోమఠం, తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అతని ఇటీవలి వెబ్ సిరీస్, సేవ్ ది టైగర్స్ 2, కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆయన కథానాయకుడిగా నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది అని సమాచారం.

దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో వైశాలి రాజ్, అలీ రెజా, మోయిన్, నిజాల్‌గల్ రవి, ఆనంద చక్రపాణి, తరుణ్ భాస్కర్, రవీందర్ రెడ్డి, లావణ్య రెడ్డి, జ్యోతి రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, శ్వేత అవస్తి, సాయి కృష్ణ, ఫణి చంద్రశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

జరగండి : చరణ్ ఫ్యాన్స్ లీక్డ్ వెర్షన్ కే వోటు!?

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” (Game Changer) కోసం తెలిసిందే. మరి నిన్ననే చరణ్ బర్త్ డే కానుకగా అవైటెడ్ ఫస్ట్ సింగిల్ “జరగండి” (Jaragandi) ని రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఎప్పుడో గత ఏడాదిలోనే రిలీజ్ కి తీసుకురావాల్సింది. కానీ అలా వాయిదా వేస్తూ వచ్చారు. దీనికి ముందు కూడా ఈ సినిమా సాంగ్ లీక్ అవ్వడం కూడా మేకర్స్ కి తలనొప్పిగా మారింది.

అయితే నిన్న వచ్చిన సాంగ్ విషయంలో కొత్తగా విన్న వారికి పర్వాలేదు కానీ ముందే లీక్డ్ వెర్షన్ ని వినేసిన చరణ్ ఫ్యాన్స్ కి మాత్రం కొత్త వెర్షన్ రుచించలేదనే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మెయిన్ గా మొదటి సాంగ్ కి ఇప్పుడు వచ్చిన దానికి గాయకులని మార్చడం అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదంటున్నారు. మరి ఫైనల్ గా అయితే మేకర్స్ రిలీజ్ చేసిన అవుట్ పుట్ నే అంతిమం అని చెప్పుకోవాలి. మరి సంగీత దర్శకుడు థమన్ మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా అనేది చూడాలి.

వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో “ఓం భీమ్ బుష్”

యంగ్ హీరో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం లో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ (Om Bheem bush). ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తోంది.ఈ చిత్రం క్లీన్ హిట్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబందించిన వసూళ్ల వివరాలను మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం 6 రోజుల్లో 25.20 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం లో శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, అయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ లు కీలక పాత్రల్లో నటించగా, సన్నీ ఎంఆర్ సంగీతం అందించారు. లాంగ్ రన్ లో ఈ సినిమా మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లేటెస్ట్…స్టైలిష్ స్టార్ మైనపు విగ్రహం తో ఐకాన్ స్టార్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ స్టార్ హీరోల్లో ఒకరు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో నేడు అల్లు అర్జున్ మైనపు విగ్రహంను ఆవిష్కరించారు. దీనిపై ఎంతో ఎగ్జైట్ అయిన అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదిక గా సరికొత్త ఫోటో ను తన అభిమానులతో పంచుకున్నారు.

నేడు మైనపు విగ్రహం అవిష్కరణ అని, ప్రతి నటుడికీ ఇది మైలురాయి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఇందుకు సంబంధించిన ఒక ఫోటో ను షేర్ చేశారు. అల వైకుంఠపురములో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఐకానిక్ సీన్స్ కి సంబందించిన ఫోటో ను విగ్రహం గా అక్కడ పెట్టారు. విగ్రహం తో పాటుగా బన్నీ బ్యాక్ పోజ్ ఇచ్చారు. ఈ ఫోటో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ, తదుపరి పుష్ప 2 ది రూల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కలియుగం పట్టణంలో: నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తాను – హీరోయిన్ ఆయుషి పటేల్!

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కలియుగం పట్టణంలో. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. ఈ క్రమంలో హీరోయిన్ ఆయుషి పటేల్ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే.

కలియుగం పట్టణంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదు. ఒక్కో సీన్‌లో ఒక్కోలా ప్రేక్షకులకు అనిపిస్తుంది. నా పాత్రకు ఇంటర్వెల్‌లో ఒకలా, క్లైమాక్స్‌లో మరో ఒపీనియన్ వస్తుంది.

కలియుగం పట్టణంలో అవకాశం ఎలా వచ్చింది? సినిమాలపై ఆసక్తి ఎలా వచ్చింది?

చిన్నతనం నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. ఆయనలానే ఎదగాలని అనుకునేదాన్ని. ఈ మూవీ నాకు ఓ మేనేజర్ వల్ల వచ్చింది. ఈ మూవీ కోసం ఎన్నో వర్క్ షాప్స్ చేశాం. ఆ టైంలోనే హీరో విశ్వతో కలిసి ఎన్నో సీన్ల గురించి చర్చించుకున్నాం.

కలియుగం పట్టణంలో’ మూవీ కోసం కడపలో షూటింగ్ చేయడం ఎలా అనిపించింది?

కడపలో అందమైన లొకేషన్స్ చాలా ఉన్నాయి. అక్కడి ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. అక్కడ ఈ చిత్రాన్ని ఎంతో సరదాగా షూట్ చేశాం. చాలా పార్ట్ అక్కడే షూట్ చేశాం. కొంత మాత్రం హైద్రాబాద్‌లో షూట్ చేశాం.

కలియుగం పట్టణంలో’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఎలా అనిపిస్తోంది?

ప్రస్తుతం మేం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం టూర్స్ వేస్తున్నాం. వెళ్లిన ప్రతీ చోటా మంచి రెస్పాన్స్ వస్తోంది. మమ్మల్ని అందరూ గుర్తు పడుతున్నారు. మా సినిమా టీజర్, ట్రైలర్ గురించి చెబుతున్నారు. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా నా గురించి, నా ఫస్ట్ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.

కలియుగం పట్టణంలో’ దర్శకుడు రమాకాంత్ రెడ్డితో పని చేయడం ఎలా అనిపించింది?

రెండు గంటలకు పైగా నాకు కథను నెరేట్ చేశారు. ఆయనకు ఎంతో క్లారిటీ ఉంది. మా దర్శకుడు ఎప్పుడూ కూడా కట్ చెప్పరు. కట్ చెబితే ఎండ్‌లో వచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మిస్ అవుతాయ్ అని కట్ చెప్పరు. మా దర్శకుడు ఎంతో సరదాగా షూటింగ్ చేసేవారు. కథ ఏం చెప్పారో, అదే తీశారు. ఆర్ఆర్ వల్ల సినిమా మరోస్థాయికి వెళ్లింది.

కలియుగం పట్టణంలో’ నిర్మాతల గురించి చెప్పండి?

కలియుగం పట్టణంలో’ సినిమా కోసం కడపలో షూట్ చేసినప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. మా అందరినీ చక్కగా చూసుకున్నారు. సినిమాకు ఎంత ఖర్చైనా కూడా వెనుకాడలేదు. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. మంచి సినిమా తీశాం.. దాన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని మా నిర్మాతలు తపనపడుతుంటారు.

విశ్వ కార్తికేయ పక్కన నటించడం ఎలా అనిపించింది?

విశ్వ కార్తికేయ నాకు ఎంతో సహకరించారు. ప్రతీ సీన్ గురించి చర్చించుకునేవాళ్లం. ఇలా చేద్దాం. అలా చేద్దాం అని మాట్లాడుకునేవాళ్లం. ఇంత మంచి వ్యక్తితో నా మొదటి సినిమా రావడం ఆనందంగా ఉంది.

తదుపరి చిత్రాల గురించి చెప్పండి?

కలియుగం పట్టణంలో రిలీజ్ కాకముందే నాకు మూడు ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ వంటివి నాకు నచ్చదు. అందుకే చాలా సినిమాలు ఒప్పుకోలేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాను. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాలేదు. కొన్ని సినిమాలు చేసినా పర్లేదు. మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

రజినీకాంత్ – లోకేష్ కనగరాజు మూవీ టైటిల్ కి డేట్ ఫిక్స్!


కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ (Lokesh) కనగరాజు లియో (Leo) చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తో తలైవర్ 171 (Thalaivar 171) ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ నేడు రివీల్ చేశారు. ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ టీజర్ విడుదల పై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 22 వ తేదీన టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. సూపర్ స్టార్ రజనీకాంత్ లుక్ తో కూడిన ఈ పోస్టర్ విశేషం గా ఆకట్టుకుంటుంది. చేతులకు బేడిలతో, స్టైలిష్ గా ఉన్నారు. ఈ స్టైలిష్ లుక్ కి ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇంటర్వ్యూ : సిద్ధూ జొన్నలగడ్డ – “టిల్లు స్క్వేర్” లో రాధికా ఉందో లేదో అప్పుడే తెలుస్తుంది

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే “టిల్లు స్క్వేర్” అని చెప్పవచ్చు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సిద్ధూ తన కథనం అందించాడు.. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘డీజే టిల్లు’కి మించిన వినోదాన్ని అందించడానికి ‘టిల్లు స్క్వేర్’ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో ముచ్చటించిన కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

డీజే టిల్లు చాలా పెద్ద హిట్ అయ్యింది, ఇప్పుడు టిల్లు స్క్వేర్ విషయంలో ఏమన్నా ఒత్తిడి అనిపిస్తుందా?

డీజే టిల్లు సమయంలో ప్రేక్షకుల్లో అంచనాల్లేవు. హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో మరోసారి మ్యాజిక్ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్ పుట్ ని అందించడానికి కృషి చేశాం.

ఈ సీక్వెల్ పాత్రకి కొనసాగింపుగా ఉంటుందా? లేక కథకి కొనసాగింపుగా ఉంటుందా?

రెండింటికి కొనసాగింపుగా ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. కథ కొనసాగింపు కూడా కొంత ఉంటుంది కానీ.. అది పాత కథను గుర్తుచేస్తూ కొత్త అనుభూతిని ఇస్తుంది. టిల్లు పాత్ర కూడా సీక్వెల్ లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడే చెప్పను. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా సర్ ప్రైజ్ లు, షాక్ లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్ గా నవ్విస్తాడు.

డీజే టిల్లు పాత్ర ఎలా పుట్టింది?

టిల్లు పాత్ర నా ఆలోచనలు, నేను చూసిన అనుభవాల నుంచి పుట్టింది. టిల్లుకి, నాకు ఒక్కటే తేడా. టిల్లు తన మనసులో ఉన్నవన్నీ బయటకు అంటాడు. నేను మనసులో అనుకుంటాను అంతే తేడా.

ఈ సినిమాకి మీ పాత్రని మించి అనుపమ డామినేషన్ ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారా?

అలా ఏముండదు. కథలో ఏ పాత్రకు ఉండాల్సిన ప్రాధాన్యత ఆ పాత్రకు ఉంటుంది. డీజే టిల్లులో కూడా హీరో, హీరోయిన్ రెండు పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది. హీరో పాత్ర లేకపోతే హీరోయిన్ పాత్ర పండదు, అలాగే హీరోయిన్ పాత్ర లేకపోతే హీరో పాత్ర పండదు.

ఈ సినిమాకి రన్ టైం చాలా తక్కువ ఉండటానికి కారణం?

కావాలని తగ్గించలేదు. సినిమాకి ఎంత అవసరమో అంత ఉంచాము. కామెడీ సినిమా కాబట్టి ఎక్కువ నిడివి లేకపోతేనే ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకులను పూర్తిస్థాయి వినోదాన్ని అందించగలం.

సీక్వెల్ కి డైరెక్టర్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది?

సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయంలో విమల్ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యి ఉండటంతో అందుబాటులో లేరు. మరోవైపు నేను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్నాము. మా కలయికలో డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి.. అలా మల్లిక్ న దర్శకుడిగా తీసుకోవడం జరిగింది.

ఈ సినిమాకి త్రివిక్రమ్ గారు ఏమైనా సూచనలు చేశారా?

ఆయనకు సినిమాల్లో ఎంతో అనుభవం ఉంది. అలాగే ఎన్నో పుస్తకాలూ చదివిన నాలెడ్జ్. ఆయనలా నాలెడ్జ్ సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. త్రివిక్రమ్ గారి సలహాలు, సూచనలు ఖచ్చితంగా సినిమాకి హెల్ప్ అవుతాయి. అయితే ఆయన ఎప్పుడూ కథలో మార్పులు చెప్పలేదు. ఈ భాగం ఇంకా మెరుగ్గా రాస్తే బాగుంటుంది వంటి సలహాలు ఇచ్చేవారు.

సీక్వెల్ లో రాధిక పాత్ర కూడా ఉంటుందా?

అది మీరు థియేటర్ లో చూసి తెలుసుకోవాలి. (నవ్వుతూ)

మరి కొనసాగింపుగా పార్ట్-3 కూడా ఉంటుందా?

సీక్వెల్ అనుకున్నప్పుడు లక్కీగా ఒక మంచి కథ తట్టింది. అలాగే పార్ట్-3 కి కూడా జరుగుతుందేమో చూడాలి. రెండు మూడు ఐడియాస్ ఉన్నాయి.. చూడాలి ఏమవుతుందో. అయితే టిల్లు-3 కంటే ముందుగా మరో విభిన్న కథ రాసే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం ఐతే నా దృష్టి అంతా టిల్లు స్క్వేర్ పైనే ఉంది.

భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం కోసం చెప్పండి?

డీజే టిల్లుకి థమన్ గారి నేపథ్య సంగీతం ఎంత ప్లస్ అయిందో.. టిల్లు స్క్వేర్ కి భీమ్స్ సంగీతం అంత ప్లస్ అవుతుంది.

జస్ట్ ఓటిటి హక్కులు తోనే సగం బడ్జెట్ రాబట్టేసిన ప్రభాస్ క్రేజ్..


గత కొన్నేళ్ల నుంచి ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా భాషల్లో భారీ మార్కెట్ ఉన్న ఏకైక హీరోగా అయితే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కొనసాగుతున్నాడు. బాహుబలి 1,2 తర్వాత సరైన హిట్ లేకపోయినప్పటికీ “సలార్” (Salaar) సినిమాతో హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో చూపించాడు.

అంతే కాకుండా ఎలాంటి జానర్ కి అయినా కూడా తాను ఫస్ట్ ఛాయిస్ లా తాను తప్ప మరో హీరో ఆ పాత్రని మోయలేడు అనే రేంజ్ లో తన ఛరిష్మాని మార్చుకోగా అలా తాను తప్ప ఇంకో హీరో చేయలేడు అనే రేంజ్ లో చేస్తున్న మరో సినిమానే “కల్కి 2898ఎడి” (Kalki 2898 AD).

దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇండియా సినిమా హిస్టరీ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ చిత్రానికి సుమారుగా 600 కోట్లకి పైగా బడ్జెట్ పెడుతున్నారని టాక్ ఉంది. మరి ఇందులో సగానికి పైగా బడ్జెట్ ని కేవలం ఓటిటి హక్కులతోనే రాబట్టేసినట్టుగా ఇప్పుడు టాక్.

హిందీ సహా సౌత్ భాషలు హక్కులు ఈ సినిమావి రికార్డు ధరకి అమ్ముడుపోయినట్టుగా బజ్ ఉంది. కేవలం ఈ రెండు మాత్రమే 300 కోట్లకి పైగానే దాటేశాయి. దీనితో ప్రభాస్ ప్రెజెన్స్ కి ఏ రేంజ్ మార్కెట్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని అసలే వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.

ఇక థియేట్రికల్ బిజినెస్ ఏ లెవెల్లో ఉంటుందో అన్నీ సెట్ అయ్యి సరైన టాక్ పడితే మాత్రం గతంలో సలార్ కి మిస్ అయ్యిన 1000 కోట్ల గ్రాస్ మార్క్ ఖచ్చితంగా ఈ చిత్రానికి వచ్చి పడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎలాంటి వండర్స్ సెట్ చేస్తుందో చూడాలి.

ఇక ఈ చిత్రానికి టాలెంటెడ్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు అత్యంత కీలక పాత్రలు చేస్తున్నారు.

అఫీషియల్ : సిద్ధార్థ్, అదితి పెళ్లి కాలేదు కానీ.. లేటెస్ట్ ట్విస్ట్

ఒక టైం లో టాలీవుడ్ యూత్ లో మంచి ఫేమ్ తో అదరగొట్టిన లవర్ బాయ్ హీరో సిద్ధార్థ్ (Siddharth) రీసెంట్ గానే చిన్నా, ఓయ్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని మరోసారి పలకరించాడు. అయితే మన సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకడైన తాను గత కొంతకాలం నుంచి యంగ్ హీరోయిన్ అదితిరావు హైదరితో (Aditi Rao Hydari) రిలేషన్ లో ఉన్నట్టుగా అనేక వార్తలు వచ్చాయి.

ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే తరచుగా కనిపిస్తుండడంతో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే టాక్ ఉంది. మరి ఇటీవల ఇద్దరు పెళ్లి కూడా చేసేసుకున్నట్టుగా పలు పుకార్లు రాగా ఫైనల్ గా ఈ వార్తలు అన్నిటికి అదితి రావు హైదరి చెక్ పెట్టింది. తన సోషల్ మీడియా వేదికగా వీటికి తెర దించేస్తూ తాము ఎంగేజ్ (Siddharth Aditi Rao Hydari Engaged) అయ్యినట్టుగా ఒక బ్యూటిఫుల్ పిక్ పెట్టి కన్ఫర్మ్ చేసింది.

తనకి సిద్ధార్థ్ ఎస్ చెప్పాడు అన్నట్టుగా అందరికీ అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది. దీనితో ఇన్ని రోజులు వస్తున్నా వార్తలకి వారు ఒక చక్కటి ముగింపు ఇచ్చారని చెప్పాలి. ఇక ఇది చూసిన వారి ఫాలోవర్స్ వారి కొత్త జీవితానికి అభినందనలు తెలియజేస్తున్నారు.

బాలీవుడ్ స్పై యూనివర్స్ లోకి బాలయ్య విలన్!?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర పలు యూనివర్స్ సినిమాలు మొదలయిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని సినీ ఇండస్ట్రీస్ లో కూడా సినిమాటిక్ యూనివర్స్ చిత్రాలతో మూవీ లవర్స్ కి మేకర్స్ క్రేజీ ట్రీట్ ఇస్తున్నారు. అలా బాలీవుడ్ లో హిట్ అయ్యిన సెన్సేషనల్ ఫ్రాంచైజ్ భారీ నిర్మాణ సంస్థ యష్ ఫిల్మ్స్ వారి స్పై యూనివర్స్ (YRF Spy Universe) కోసం చెప్పాలి.

మరి ఈ యూనివర్స్ నుంచి ఇప్పటికే షారుఖ్ (Shah Rukh Khan), సల్మాన్ (Salman) మరియు హృతిక్ లాంటి స్టార్స్ తో సినిమాలు రాగా ఈ ఫ్రాంచైజ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా జాయిన్ అయ్యాడు. అయితే ఇపుడు మరో క్రేజీ రూమర్ ఈ స్పై యూనివర్స్ పై వినిపిస్తుంది. ఈ స్పై యూనివర్స్ లో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) కూడా జాయిన్ కాబోతున్నాడని తెలుస్తుంది.

మరి ఇదే కానీ నిజం అయితే ఈ స్పై యూనివర్స్ మరింత దృడంగా మారుతుంది అని చెప్పాలి. మరి బాబీ డియోల్ కి “అనిమల్” తర్వాత ఏ రేంజ్ ఫేమ్ వచ్చిందో తెలిసిందే. అలాగే తాను ఇప్పుడు బాలయ్య 109లో విలన్ గా పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” లాంటి భారీ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. మరి తన రాక బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ లో ఉందో లేదో వేచి చూడాలి.

ఈ క్రేజీ కాంబినేషన్ కి “హను మాన్” మేకర్స్ భారీ బడ్జెట్?

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ లో హీరో డైరెక్టర్ కాంబినేషన్ కూడా కాంబినేషన్ లలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ అలాగే యూత్ స్టార్ నితిన్ (Nithiin) కాంబినేషన్ కూడా ఒకటి. మరి వీరి నుంచి వచ్చిన మొదటి సినిమానే “ఇష్క్” సెన్సేషనల్ హిట్ కాగా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ నుంచి మరో సినిమా వస్తున్నట్టుగా టాక్ కన్ఫర్మ్ అయ్యింది.

మరి క్రేజీ కాంబినేషన్ ని పాన్ ఇండియా సెన్సేషన్ చిత్రం “హను మాన్” (Hanu Man Movie) నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మించనున్నారని స్ట్రాంగ్ బజ్ ఉంది. అయితే వీరి కాంబినేషన్ లో రానున్న ఈ స్పెషల్ ప్రాజెక్ట్ కి భారీ బడ్జెట్ నే పెట్టబోతున్నారని ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఈ టాక్ ప్రకారం ఈ సినిమాకి ఈజీగా బడ్జెట్ 50 కోట్ల పైమాటే అని టాక్. మరి ఏ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారో ఇంకా తెలియరాలేదు కానీ ఇంత బడ్జెట్ అంటే గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారని చెప్పవచ్చు. మరి ఈ కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందో కాలమే నిర్ణయించాలి.

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థకి “టిల్లు స్క్వేర్” హక్కులు

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన క్రేజీ సీక్వెల్ చిత్రం “టిల్లు స్క్వేర్”. మరి డీజే టిల్లు కి సీక్వెల్ గా చేసిన ఈ చిత్రం నుంచి నిన్ననే రిలీజ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు రేపు గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ సినిమా ఓటిటి అప్డేట్ తెలుస్తుంది.

దీని ప్రకారం ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులని దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ వారు అయితే సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి వారు సాలిడ్ ధరనే ఈ చిత్రానికి అందించినట్టుగా టాక్. మొత్తానికి అయితే థియేటర్స్ లో వచ్చాక ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమాలో మురళీ శర్మ, ప్రిన్స్ తదితరులు నటించగా రామ్ మిర్యాల, భీమ్స్ లు సంగీతం అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.