ఇంటర్వ్యూ : అల్లు శిరీష్ – రొటీన్ సినిమా తో కాకుండా మంచి సినిమా తో ప్రారంభిద్దామనుకున్నాను

ఇంటర్వ్యూ : అల్లు శిరీష్ – రొటీన్ సినిమా తో కాకుండా మంచి సినిమా తో ప్రారంభిద్దామనుకున్నాను

Published on Apr 18, 2013 1:30 AM IST
First Posted at 21:00 on Apr 17th

Allu-Shirish
అల్లు శిరీష్ హీరోగా ‘గౌరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్దమైంది. ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా మేము కాసేపు ముచ్చటించాము. శిరీష్ ఎంతో తెలివిగా తన కెరీర్ ని చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు, అలాగే అతని కోరికలు, తనకున్న హద్దుల గురించి మాతో పంచుకున్నాడు. అలాగే అసలు తను గౌరవం సినిమాని ఎందుకు ఎంచుకున్నాడు? రామ్ చరణ్, అల్లు అర్జున్ తనకి ఎలాంటి సలహాలు ఇచ్చారు? అనేవి కూడా మాతో పంచుకున్నాడు.వీటన్నిటికీ అతను ఏమేమి సమాధానాలు ఇచ్చారో వాటిని మీకోసం అందిస్తున్నాం…

ప్రశ్న) మీ మొదటి సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కాస్త భయంగా ఏమన్నా ఉందా?

స) నిజానికి నేను ఉత్కంఠతకు లోనవుతున్నాను. మీరు అన్న భయం గురువారం రాత్రి కానీ, శుక్రవారం ఉదయం కానీ కలగచ్చేమో(నవ్వుతూ). ప్రస్తుతానికి మాత్రం నేను ఈ కధని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అన్న ఉత్కంఠతలో మాత్రమే ఉన్నాను. చాలా మంది తమకు సరిపడదు అని భావించే కధ ఇది. మేము కాస్త కొత్తగా, ధైర్యంగా ఈ కాన్సెప్ట్ ని ట్రై చేసాం.

ప్రశ్న) మీ మొదటి సినిమాయే సోషల్ డ్రామా తరహాలో సాగే ఒక ద్విభాషా చిత్రం. ఇలాంటి ప్రయత్నం చెయ్యడానికి మీకు అంత విశ్వాసం ఎలా కలిగింది?

స) నేను ఈ సినిమా బృందంలోకి అడుగుపెట్టడానికి ముందే దర్శకుడు రాధామోహన్ మరియు ప్రకాష్ రాజ్ లు ఈ సినిమాని రెండు భాషల్లో తియ్యాలని అనుకున్నారు. కాకపోతే ఈ సినిమాకి వచ్చిన చిక్కల్లా ఒక కొత్త ముఖాన్ని ఈ సినిమాలో ఉంచాలనుకున్నారు. తమిళ మరియు తెలుగు నేటివిటీకి సరిపోయే ఒక యువ హీరో వారికి అవసరం. ఇది వారి ఆలోచనే. నేను ఆ ఆలోచనకు సరిపోయాను అంతే.

ప్రశ్న) మీ ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీకి పరిచయస్తులే. మీకు సినీ నిర్మాణంలో అనుభవం కూడా ఉంది. వీటి ద్వారా మీరు ఈ చిత్రంలో చేసిన పనికి ఆనందంగానే ఉన్నారా?

స) అవును. నేను ఈ సినిమా యొక్క మొదటి కాపీ చూసాను. చాలా ఆనందంగా ఉన్నాను. సినీ రంగంలో పనిచేసే ఏ ఒక్కరైనా ఈ సినిమాని తప్పక మెచ్చుకుంటారు. ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రం తప్పక అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా ఫ్లో కుడా వేగంగానే సాగుతుంది. ఇదేమి నిధానంగా సాగే సినిమా కాదు.

ప్రశ్న) తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకుల అభిరుచులు వేరుగా ఉంటాయి. ఈ సినిమా ఇరువర్గాలను మెప్పించగలదని మీరు అనుకుంటున్నారా?

స) నేను మీతో అంగీకరిస్తాను. తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల అభిరుచులు వేర్వేరు. అందుకే ఈ సినిమాని రెండు విధాలుగా రూపొందించాము. తెలుగు వెర్షన్ కి, తమిళ వెర్షన్ కి చాలా మార్పులు చేసాము. వేగంగా సాగే డ్రామాని తెలుగు ప్రేక్షకులు ఇష్టపడతారు. మనకి కొన్నిరకాల ముగింపులే నచ్చుతాయి. అందుకే ఈ రెండు వెర్షన్ల క్లైమాక్స్ ని కూడా వేరువేరు విధంగా చిత్రీకరించాము. వారివారి అభిరుచులకు తగ్గట్టుగా తగు జాగ్రత్తలు తీసుకున్నాము.

ప్రశ్న) ‘గౌరవం’ స్క్రిప్ట్ ని అల్లు అరవింద్, చిరంజీవి గారు విన్నారా?

స) ఈ సినిమా స్క్రిప్ట్ ని మొదట ప్రకాష్ రాజ్ గారు నాకు వినిపించారు. నాకు బాగా నచ్చింది. ఆ తరువాత నాన్నగారు, చిరంజీవి గారు కుడా విన్నారు. వాళ్ళకి కుడా నచ్చింది. వాళ్ళు నన్ను “ఈ సినిమా అందరిలాగా సాదాసీదాగా సాగే మొదటి సినిమా కాకపోవచ్చు. ఇలాంటి కధతో ప్రేక్షకులకు పరిచయం అవ్వడానికి నువ్వు సిద్దమేనా ?” అని అడిగారు. నేను సిద్దమే అన్నాను.

ప్రశ్న) మీరు మొదటి సినిమాకే ఇలాంటి వైవిధ్యమైన పంధాను ఎందుకు ఎంచుకున్నారు?

స) నేను మసాలా సినిమాలు, కమర్షియల్ సినిమాలు నా రెండో చిత్రంలోనో, మూడో చిత్రంలోనో చెయ్యచ్చు, ఇదే మాట నేన్ను నాన్నగారికి, చిరంజీవి గారికి కుడా చెప్పాను. నిజాయితీగా చెప్పాలంటే అల్లు శిరీష్ మొదటి సినిమాకి అందరూ ఉత్కంఠతతో ఎదురుచూడకపోవచ్చు. కాబట్టి నా చుట్టూ తిరిగే సినిమా కాకుండా ఒక గొప్ప కధ ఉన్న మంచి సినిమాలో నేను భాగస్వామిని కావాలని అనుకున్నారు. శిరీష్ ఆ సినిమాకి అదనపు ఆకర్షణ మాత్రమే అలాగే అందరూ ఒక మంచి సినిమా అని గుర్తుపెట్టుకునేలా ఉండాలని అనుకున్నాను.
ప్రశ్న) మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వాళ్ళ హీరోల సినిమాలలో మంచి డాన్సులను, హాస్యాన్ని కోరుకుంటారు. మీ సినిమాతో వారు అవి పొందగాలరా?

స) అటువంటి వాటిని చూపించడానికి నాకు ఈ సినిమా కదానుగుణంగా సహకరించలేదు. వీటిని నా రాబోయే సినిమాలలో పెట్టడానికి తప్పక ప్రయత్నిస్తాను. నేను నాకంటూ ఒక పంధాను ఏర్పర్చుకోవడానికి తప్పక కష్టపడతాను. వైవిధ్యమైన సినిమాలలో నటిస్తాను. ప్రతి రెండు కమర్షియల్ సినిమాల నడుమ ‘ప్రస్థానం’, ‘వేదం’ వంటి సినిమాలు చేస్తాను.

ప్రశ్న) ఇది మీ మొదటి సినిమా కనుక ఈ సినిమాలో మీరు ఎదుర్కున్న సమస్యలు ఏమిటి?

స) (ఆలోచిస్తూ) ఒకటి మాత్రం చెప్పగలను షూటింగ్ సమయంలో చాలా చాలెంజింగ్ గా అనిపించేది. ద్విభాషా సినిమా కనుక ప్రతీ సన్నివేశం రెండు సార్లు తియ్యవలసి వచ్చింది. సెట్ లో చాలా మంది అనుభవం ఉన్న నటులు ఉన్నారు. వారి ఆలస్యానికి నేను కారణం కాకూడదు అనుకున్నాను. టెక్నికల్ గా నేను ఏమి సమస్యలు ఎదుర్కోలేదు. చిత్రీకరించిన ప్రదేశాలు కాస్త కష్టమైనా అది నన్ను అంతగా ఇబ్బందిపెట్టలేదు.

ప్రశ్న) యామి గౌతంకు మీ పనితీరు బాగా నచ్చినట్టుంది?

స)(నవ్వుతూ) నా ద్రుష్టిలో యామి చాలా తెలివైన అమ్మాయి. నా పనితీరు తనకి నచ్చింది. ఈ విషయాన్ని షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా సందర్భాలలో తెలియచేసింది కుడా..

ప్రశ్న) ప్రతీ నటుడికి ఒక సౌకర్యవంతమైన బాణీ ఉంటుంది. కొందరికి కామెడీ, మరికొందరికి డాన్సు… మరి మీకు?

స) ఈ సినిమా ద్వారా అటువంటివి ప్రయత్నించడానికి తగిన అవకాశం రాలేదు. నా వరకు నేను కామెడీ బాగా చేయ్యగలనని నా నమ్మకం. యాక్షన్ ని కుడా నేను ఆస్వాదిస్తాను. బన్ని నుండి నేను కమర్షియల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాను. డాన్స్ విషయానికి వస్తే హిప్ హాప్ నాకు ఇష్టం.

ప్రశ్న) యాక్టర్ గా మారడానికి మీకు మీరే శిక్షణను ఇచ్చుకున్నారా?

స) నేను మాస్ కమ్యూనికేషన్స్ చేసాను కనుక కాలేజీ రోజుల్లో చాలా సార్లు షూటింగ్లో పాల్గొన్నాను. అలా నాకు నటుడిగా నటించడానికి అవకాశం లభించింది. దాన్ని మెరుగుపరుచుకోవడానికి ముంబాయిలో క్రియేటింగ్ క్యారెక్టర్స్ సంస్థలో మూడు నెలలు శిక్షణ తీస్కున్నాను. దర్శకుడు మారుతి మరియు రవి కుమార్ చౌదరి నాతో మూడు లఘు చిత్రాలు తీసారు. సరైన బృందంతో ఆ సినిమాలను తీసాము. చెన్నైలో పాండియన్ మాస్టర్ దగ్గర వై.ఎం.సి.ఏ లో కుడా శిక్షణ తీస్కున్నాను. అతను చాలా ప్రసిద్దిగాంచిన ఫైట్ మాస్టర్. ఇప్పుడు ఉన్నవారందరికీ ఆయనే గురువు.

ప్రశ్న) చరణ్, బన్నిలు మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా?

స) సినిమాకు గాను వారు ఎప్పుడూ నాకు సలహాలు ఇవ్వలేదు. కెరీర్ కు సంబంధించి కొన్ని సలహాలు ఇచ్చారంతే. ప్రతి ఒక్కరూ తమను తామే మెరుగుపరుచుకోవాల్సిన రంగం ఇది. మనకి నచ్చిన నటులు కొంతమంది ఉంటారు. మనకు తెలియకుండానే వాళ్ళని మనము అనుకరిస్తాము. బన్ని నన్ను అదే చెయ్యమని చెప్పాడు. చరణ్ నాకు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చాడు “మనం మన సినిమాల ద్వారా 40 నుండి 50 కోట్లు ఖర్చుబెడతున్నాం. కాబట్టి వైవిధ్యమిన కధాంశాలను వదిలి కమర్షియల్ కధల అదుపులో నడుస్తున్నాము. దీనివల్లే నేను చాలా సినిమాలు వదులుకున్నాను. నువ్వు మూస పరుగులో పడాల్సిన అవసరంలేదు. ఈ క్రమంలో నిన్ను నువ్వు నిరూపించుకో. నీలో నువ్వు సంఘర్షణ పడే పాత్రలు చెయ్యి. సినిమా ద్వారా నీలోవున్న నటుడు నలుగురికీ తెలియాలి ” అని అన్నాడు. అది నాకు చాలా నచ్చింది.

ప్రశ్న) మిమ్మల్ని మీరు యాక్టర్ గా ఇష్టపడతారా? హీరోగా ఇష్టపడతారా?

స) ఒక ఆర్టిస్ట్ గా ఆ రెంటికీ తేడా ఉందంటే ఒప్పుకోను. మీరు కమల్ హాసన్ ని యాక్టర్ గాను, రజినీ కాంత్ ని స్టార్ గానూ చెప్తారు. మరి అమితాబ్ ఎవరు?? చిరంజీవి ఎవరు?? వాళ్ళు సూపర్ స్టార్స్.. వాళ్ళను యాక్టర్స్ అనగలమా? ఏ ఆర్టిస్ట్ కైనా రెండూ ఇష్టమే. ఎంచుకునే పాత్రలను బట్టి అది తెలుస్తుంది.

ప్రశ్న) ఈ సినిమా సంగీతం ద్వారా మీరు ఆనందపడ్డారా?

స) ఈ సినిమాలో ముందుగా 4 పాటలు ఉంచాలని అనుకున్నాం. కానీ ఆఖరికి రెండే పెట్టాము. కారణం సినిమాకు పాటలు అడ్డు కాకూడదు. థమన్ ఇచ్చిన రెండు పాటలు నాకు నచ్చాయి. సినిమాకు ఇవి సరిగ్గా సరిపోతాయి. నేపధ్య సంగీతానికి గానూ అతనికి మరిన్ని ప్రశంసలు అందుతాయి. అతను వాడిన పరికరాలు చాలా కొత్తగా ఇంటర్నేషనల్ అనుభూతిని కలిగించాయి. నాకు అవి మీకు ఇప్పుడు వినిపించాలని ఉంది.

ప్రశ్న) ఈ సినిమాకు ‘గౌరవం’ అనే పేరు సరైనదేనా?

స) అవును. ఈ విషయాన్ని ఈ సినిమా క్లైమాక్స్ తప్పక రుజువు చేస్తాది. ‘గౌరవం’ అన్నదానికి మనకు తెల్సిన అర్ధం తప్పు. గొప్ప కుటుంబంలోనో, వంశంలోనో పుట్టడం వల్ల గౌరవం రాదు. మనం మన జీవితాన్ని సాగించే పద్ధతి వలనే గౌరవం వస్తుంది. అది ఈ సినిమా ద్వారా చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది.

ప్రశ్న) కులం అనేది కాస్త నిషేదభరితమైన అంశం ఏమో..

స) అవును. బాలచందర్ గారి తరువాత ఈ సబ్జెక్టును లోతుగా తియ్యడానికి ఎవరూ సాహసం చెయ్యలేదు. పల్లెటూరిలో స్నేహితుడిని వెతకడానికి వెళ్ళే పాత్ర నాది. అక్కడ నేను వివిధ కుల ఘర్షణలను, కులాంతర సంఘటనలను ఎదుర్కుంటాను. సమాజంలో కుల చిచ్చు పెట్టి బతికే పాత్రల నడుమ నేను జీవిస్తాను. ఇందులో వారినీ కించపరిచేలా డైలాగులు లేవు. సినిమా అద్బుతంగా ఉంటుంది. కుల వ్యవస్థను ఎలా అరికట్టాలో అందంగా చూపించాం.

ప్రశ్న) మీ తరువాత సినిమాలో యాక్షన్ ఎంటర్టైనర్ పాత్రను ఎంచుకుంటారా?

స) అటువంటి పాత్రలు వస్తే నాకు ఆనందమే, కానీ అలాంటి కథే చెయ్యమని నేను పట్టుబట్టను. నా దగ్గరకు వచ్చే అన్ని కధలనూ చెయ్యడం ఒక చాలెంజ్ గా భావిస్తాను.

ప్రశ్న) భవిష్యత్తులో కుడా ద్విభాషా సినిమాలలో నటిస్తారా?

స) లేదు. రెండు మార్కెట్ల డబ్బులు సంపాదించాలని నేను అనుకోవడం లేదు. ద్విభాషలో చిత్రాలలో ఇరువర్గాల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు తియ్యగల దర్శకులు వస్తేనే ఒప్పుకుంటాను. నా తదుపరి చిత్రాలు పూర్తి తెలుగు సినిమాలు.

ప్రశ్న) మీరు ఖాళీ సమయాల్లో ఎం చేస్తారు?

స) నాకు ప్రయాణం అంటే ఇష్టం. పుస్తకాలు బాగా చదువుతాను. నేను తెలుగు, తమిళ్ చదవగలను, రాయగలను. కాబట్టి నేను ఈ రెండు భాషల్లో ప్రచురితమైన పుస్తకాలు చదువుతాను. స్నేహితులతో సరదాగా కాఫీ తాగడం ఇష్టం. ఇదివరకు పార్టీలకు వెళ్ళేవాడిని. ఇప్పుడు వెళ్ళటం లేదు.

ప్రశ్న) వినూత్నమైన లఘు చిత్రాలు తీసే కొత్త దర్శకులను మీరు ఆహ్వానిస్తారా?

స) మనకు చాలా మంది మంచి లఘు చిత్రాల దర్శకులు ఉన్నారు. కానీ 15 నిముషాల సినిమా తియ్యడం వేరు, 3 గంటలు సినిమా తియ్యడం వేరు. ఈ విషయంలో చాలా మంది విఫలం అవుతారు. వారందరూ ఉడుకు రక్తంతో వాళ్ళను మించిన వారు లేరనుకుంటారు. వారిని మన కమర్షియల్ డైరెక్టర్స్ కింద పని చెయ్యమని చెప్పను. కానీ వారికి రాత్రికి రాత్రే విజయం కావాలి. వాళ్ళు పూర్తి నిడివిగల సినిమాలోని మెలుకువలు తెలుసుకోవాలి. మారుతి లాంటి వారిని చూసి కెనాన్ 5డి తో సినిమా తెసేయగలం అనుకుంటున్నారు. విషయం ఏమిటంటే మారుతీ తన మొదటి చిత్రం వెనుక 10 సంవత్సరాల కష్టం ఉంది. అతను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. కొన్ని సినిమాలకు సహా నిర్మాత కూడా పనిచేసాడు. అతని విజయం వెనుక ఇంత కధ ఉంది.

ప్రశ్న ) ‘గౌరవం’ నుండి ప్రేక్షకులు ఏమి ఆశించవచ్చు?

స) ఈ సినిమా నిధానంగా సాగే సోషల్ డ్రామా సినిమా కాదు. మనుసుకు హత్తుకునే అందమైన సినిమా. స్నేహ భందాన్ని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని ట్రైలర్లో చెప్పలేదు. కానీ సినిమాలో అద్బుతమైన భావోద్వేగాలు ఉన్నాయి. అవి ప్రేక్షకులకు నచ్చుతాయి. అంటరానితనం నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు హత్తుకుంటాయి. ఇది ఒక ఆలోచనాత్మక చిత్రం

అంతటితో మేము అల్లు శిరీష్ తో మా ఇంటర్వ్యూని ముగించాము. అతను చాలా నిబద్ధత కలిగిన నటుడు. అతనికి యాక్టర్ యొక్క అసలైన అర్ధం తెలుసు. అతను తనని యాక్టర్ గా ఎలా నిరువుపించుకోవాలో కుడా తెలుసు. అతని మొదటి సినిమా విజయం సాదించాలని కోరుకుందాం

 ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు 

అనువాదం – వంశీ కృష్ణ

CLICK HERE TO ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు