చిట్ చాట్ : ఇ. సత్తిబాబు – నరేష్ డబుల్ రోల్ ‘జంప్ జిలానీ’కి హైలైట్ అవుతుంది.

చిట్ చాట్ : ఇ. సత్తిబాబు – నరేష్ డబుల్ రోల్ ‘జంప్ జిలానీ’కి హైలైట్ అవుతుంది.

Published on Jun 9, 2014 6:29 PM IST

E-Sattibabu

అల్లరి నరేష్ తో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ ఇ. సత్తిబాబు. ఇప్పటి వరకూ సింగల్ రోల్ తో ప్రేక్షకులను మెప్పించిన అల్లరి నరేష్ ని ద్విపాత్రాభినయంలో చూపిస్తూ ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన సినిమా ‘జంప్ జిలానీ’. ఈ సినిమా ఈ శుక్రవారం అనగా జూన్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘జంప్ జిలానీ’ సినిమా తమిళ సినిమాకి రీమేక్. తెలుగు నేటివిటీ కోసం కథలో ఏమన్నా మార్పులు చేసారా?

స) అవును.. తెలుగు వెర్షన్ కోసం చాలా మార్పులు చేసాం. ముఖ్యంగా తమిళంలో ఇద్దరు హీరోలు ఉంటారు కానీ తెలుగులో మాత్రం అల్లరి నరేష్ చేత డ్యూయల్ రోల్ చేయించాము.

ప్రశ్న) ఈ సినిమా గురించి చెప్పండి?

స) ‘జంప్ జిలానీ’ సినిమా కథ వంశపారపర్యంగా వస్తున్న హోటల్ చుట్టూ తిరుగుతుంది. ఈ హోటల్ ప్రాపర్టీ కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంది, దానిని కాపాడు కోవడానికి ఆ హోటల్ ఓనర్ అయిన అల్లరి నరేష్ ఏమి చేసాడనేది మీరు తెరపై చూడాలి.

ప్రశ్న) ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి చెప్పండి?

స) ఈ మూవీలో ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ హీరోయిన్స్ గా నటించారు. ఇషా చావ్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గా కనిపిస్తే, స్వాతి దీక్షిత్ బాబ్లీ కాలేజీ గర్ల్ పాత్రలో కనిపిస్తుంది.

ప్రశ్న) అల్లరి నరేష్ తో మీకు ఇది నాలుగో సినిమా.. మరి జంప్ జిలానీలో నరేష్ ని ఎంత డిఫరెంట్ గా చూపించారు?

స) నా అన్ని సినిమాల్లోనూ నరేష్ ని చూపించిన విధానంలో సక్సెస్ అయ్యాను, అలాగే సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మొదటి సారిగా అల్లరి నరేష్ డ్యూయల్ రోల్ చేసాడు. రెండు పాత్రలకి నరేష్ పూర్తి న్యాయం చేసాడు. అలాగే రెండు పాత్రల్లోనూ పూర్తి వైవిధ్యాన్ని చూపించాడు. నరేష్ డ్యూయల్ రోల్ జంప్ జిలానీ సినిమాకి ప్రధాన హైలైట్ అవుతుంది.

ప్రశ్న) అల్లరి నరేష్ గత సినిమాలన్నీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇలాంటి తరుణంలో మీరెందుకు నరేష్ తో డ్యూయల్ రోల్ చేయించారు.?

స) మేము ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఇప్పటికే తమిళ్ లో ప్రూవ్ అయిన స్క్రిప్ట్ మా చేతుల్లో ఉంది. దాన్ని అందరికీ నచ్చేలా తీసాం..

ప్రశ్న) మీ తదుపతి ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

స) పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి, అవన్నీ ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ఒకసారి ఫైనలైజ్ కాగానే ఆ వివరాలను మీకందిస్తాను..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు