ఇంటర్వ్యూ : ప్రతాప్ కొలగట్ల – ఈ సినిమా చూసి 100కి 200% ఎంజాయ్ చేస్తారు
Published on Mar 14, 2013 10:10 pm IST

3G-Love

స్వతహాగా బిజినెస్ మాన్ అయిన ప్రతాప్ కొలగట్ల నిర్మాతగా మారి స్క్వైర్ ఇండియా స్టూడియోస్ ని స్థాపించి నూతన నటీనటులతో ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన సినిమా ‘3జి లవ్’. ఈ సినిమా ఆంధ్రపదేశ్ అంతటా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రతాప్ గారితో మేము కొద్దిసేపు ముచ్చటించాము. ఆయన సినిమా ఎలా మొదలైంది, ఎలా తీశాం, మొదలైన అన్ని విశేషాలను మాతో పంచుకున్నారు ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) సినిమా రంగంలోకి అడుగుపెట్టక ముందు మీరేం చేసేవారు?

స) నేను ఒక బిజినెస్ మాన్. మేము ఇండియా మొత్తంలో ఉన్న నగల షాపుల వారికి ప్రస్తుతం మార్కెట్ లో గోల్డ్ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి టైంలో కొనాలి, అమ్మాలి అని సూచనలు ఇస్తుంటాం. మా స్క్వైర్ ఇండియా కంపెనీకి ఇండియా మొత్తం కస్టమర్స్ ఉన్నారు.

ప్రశ్న) బిజినెస్ మాన్ అయ్యుండి సినిమా రంగంలోకి ఎలా వచ్చారు?

స) అసలు నేను ఈ సినిమా చెయ్యాలనుకోలేదండి. వైజాజ్ లో ఉన్న మా ఫ్రెండ్ సినిమా తీద్దామని ఈ స్టొరీ విన్నాడు. అతనికి నచ్చి నన్ను కూడా ఓ సారి వినమంటే విన్నాను నాకూ బాగా నచ్చింది. అప్పటికి నేను ఓ సీరియల్ తీద్దామనే ఆలోచనలో ఉన్నాను. అనుకోని కారణాల వల్ల మా ఫ్రెండ్ ఆ సినిమా నుండి తప్పుకోవడంతో సీరియల్ ఏమిచేస్తాం సినిమానే చేసి ఇండస్ట్రీలో లాంచ్ అవుదాం అనిపించి సొంత బ్యానర్ స్థాపించి ఈ మూవీని మొదలుపెట్టాం.

ప్రశ్న) సినిమాలో అందరూ నూతన నటీనటులే ఉన్నారు, వారి నటన గురించి చెప్పండి?

స) ఈ సినిమాని 2012 ఏప్రిల్ 7న ప్రారంభించాము. ఈ సినిమా కోసం కొత్త వారైన 15 మంది బాయ్స్ ని 11 మంది గర్ల్స్ ని తీసుకున్నాం. వీరందరినీ 3జి లవ్ అఫిషియల్ పేస్ బుక్ పేజ్ లో ప్రకటన ఇచ్చి అలా వచ్చిన వారిలోనుంచి 26 మందిని సెలెక్ట్ చేసాము. అందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఒక వారం రోజులు వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత అంతా సాఫీగా సాగిపోయింది. అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

ప్రశ్న) సినిమాలో 26 మంది ఉన్నారన్నారు. అందరికీ ప్రాముఖ్యత ఉందా లేక వెనుక ఒక గ్యాంగ్ ఉండాలని తీసుకున్నారా?

స) అలా ఏమీ లేదండి అందరి పాత్రలు ముఖ్యమే. ఇందులో హీరో హీరోయిన్ లాంటి వారు ఎవరూ ఉండరు. ఇది ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా. అక్కడ పలు రకాల అభిప్రాయాలు స్వభావాలు కలిగిన వారుంటారు. అలా వేరు వేరు స్వభావాలు కలిగిన 26 మందిని ఈ సినిమాలో చూపించాము. కావున ప్రతి ఒక్కరి పాత్ర కథకి ముఖ్యమే.

ప్రశ్న) ఇంతకీ మూవీ ఎలా ఉంటుంది. ఈ మూవీకి హైలైట్స్ ఏమిటి?

స) ఈ సినమా యూత్ ని టార్గెట్ చేసి తీసిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్. అతర్లీనంగా ఓ మెసేజ్ ని కూడా చెబుతున్నాము. నాలుగు ఫైట్స్, నాలుగు పాటలు అనే రొటీన్ ఫార్ములాని ఫాలో అవ్వకుండా రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమా ఇది. ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. పక్కాగా చెప్పాలంటే ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. మొత్తంగా సెకండాఫ్ సినిమాకి హార్ట్ లాంటిది. సెకండాఫ్ లో వచ్చే ప్రతి సీన్ చాలా ముఖ్యమైనది అలాగే సెకండాఫ్ చాలా అద్భుతంగా వచ్చింది..

ప్రశ్న) యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అంటున్నారు. సెన్సార్ నుంచి ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కున్నారా?

స) ప్రతి సినిమాకి కలిగే ఇబ్బందులనే మేము ఎదుర్కున్నాం. కానీ మాది యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో ఇంకాస్త ఎక్కువ ఇబ్బందులనే ఎదుర్కున్నాం. ఉదాహరణకి సెన్సార్ వారు సినిమాలో ఓ చోట వచ్చే ‘బలుపు’ అనే పదాన్ని మ్యూట్ చేసారు అదేమిటండి దానిలో భూతు ఏముంది ఏకంగా ‘బలుపు’ అనే దాని మీద సినిమానే తీసున్నారు కదా ని ప్రశ్నిస్తే సెన్సార్ వారి నుంచి జవాబు లేదు. మొత్తాని అన్ని అవరోదాలు దాటుకొని అన్నీ క్లియర్ చేసుకొని సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాము.

ప్రశ్న) ముందుగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తామని చెప్పి చివరి నిమిషంలో ఎందుకు వాయిదా వేశారు?

స) ముందుగా మేము అనుకున్న సమయంలో కొన్ని పెద్ద సినిమాలు ఉండడంతో థియేటర్లు దొరకలేదు అందుకే ఒక నెల ఆలస్యంగా విడుదల చేస్తున్నాం. ఇప్పుడు థియేటర్స్ దొరికాయి. ఆంధ్రప్రదేశ్లో సుమారు 125 -150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. సినిమాకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి థియేటర్స్ పెంచడానికి కి ప్లాన్ చేస్తాము. అలాగే ఓవర్సీస్ లో సినిమాని రిలీజ్ చెయ్యటం లేదు.

ప్రశ్న) మరి సరిగ్గా ఎగ్జామ్స్ టైంలో రిలీజ్ చేస్తున్నారు. బిజినెస్ కి ఏమీ ఇబ్బంది ఉండదంటారా?

స) మార్చి 19 కల్లా ఇంటర్మీడియట్ వారికి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అవ్వగానే వారు ఓ సినిమా చూడాలనుకుంటారు మాది ఎలాగూ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో సినిమాకి వస్తారు. సినిమా ఎలాగో వీకెండ్ లో రిలీజ్ అవుతోంది కాబట్టి ఈ నాలుగు రోజులు సినీ ప్రేమికులు వచ్చి సినిమా చూస్తారు. కావున మా సినిమా బిజినెస్ కి ఎలాంటి డోఖా ఉండదు.

ప్రశ్న) ఇండస్ట్రీకి మీరు కొత్తవారే డైరెక్టర్ ని కూడా కొత్తవారినే ఎంచుకున్నారు. డైరెక్టర్ పనితీరు ఎలా ఉంది?

స) ముందుగా డైరెక్టర్ గోవర్ధన కృష్ణ కథ చెప్పిన విధానం స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చింది. అంతే కాకుండా అతను స్క్రిప్ట్ లోనే ప్రతి ఒక్క సీన్ ని ఇలా ఉండాలి అనే విజువలైజేషన్ వేసుకొని మరీ రాసుకున్నాడు. ఆయన చెప్పినప్పటి కంటే ఇంకా గొప్పగా తీసాడు. చాలా క్లారిటీ, విజన్ ఉన్న డైరెక్టర్ దొరికినందుకు చాలా హ్యాపీ గా ఉంది. డైరెక్టర్ గురించి ఇంకా చెప్పాలంటే సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ మెంబర్ ధనలక్ష్మీ గారు ‘ అన్ని డైలాగ్స్ ఒకే సినిమాలో పెట్టేసావు కొన్ని డైలాగ్స్ ని నీ తర్వాతి సినిమా కోసం ఉంచుకోవాల్సిందని’ అన్నారు.

ప్రశ్న) ఈ సినిమాకి మ్యూజిక్ ఓ హైలైట్ అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి?

స) సినిమా మ్యూజిక్ హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే అంటారు. మేము అనుకున్న కథకి మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ కావాలి. అదే ఉద్దేశంతోనే శేఖర్ చంద్ర ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాం. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటికే మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఆయన్ని ఒక్క మ్యూజిక్ విషయంలోనే కాకుండా ఈ సినిమాలో ఆయన చేత ఓ పాట పాడించి, ఆ పాటని అతని మీదే షూట్ చేసాము. (నవ్వుతూ) ఇలా అన్ని విధాలా శేఖర్ ని వాడుకున్నాం.

ప్రశ్న) మీ తదుపరి చిత్రాలేమిటి?

స) ప్రస్తుతం కొన్ని స్టొరీలు వింటున్నాను. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు.

అక్కడే ఉన్న డైరెక్టర్ గోవర్ధన కృష్ణ ని మీ సినిమా గురించి చెప్పండి అని అడిగితే….

గోవర్ధన కృష్ణ సమాధానమిస్తూ ‘ సినిమా గురించి ఒక్కటే చెబుతానండి. మీ పారెంట్స్ తో పాటు సినిమాకి వెళ్లొద్దు. ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ , బాయ్ ఫెండ్స్ తో సినిమాకి వెళ్ళండి చూసిన తర్వాత మీరే మీ ఇంటికి వచ్చి మీ తల్లి తండ్రుల్ని సినిమాకి తీసుకెళ్తారు. ముఖ్యంగా సెకండాఫ్ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పుకోవాలి. అలాగే సెకండాఫ్ లో వచ్చే ‘లవ్ అట్ ఫస్ట్ సైట్’ అనే పాటని ఇదివరకూ ఎవ్వరూ అలా షూట్ చెయ్యలేదని’ అన్నాడు.

అలాగే ప్రక్కనే ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారిని సినిమా గురించి చెప్పమని అడిగితే …

శేఖర్ చంద్ర సమాధానమిస్తూ ‘మామూలుగా కొంతమంది దర్శకులు హీరో హీరోయిన్ మధ్య డ్యూయెట్ సాంగ్, పాటలో ఫుల్ డాన్సులుంటాయి దానికి తగ్గట్టు పాట కావాలని అడిగి చేయించుకొని వెళ్లిపోతుంటారు. కానీ గోవర్ధన్ గారు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని చెప్పి, ఇక్కడ ఇలాంటి ఫీల్ ఉంటుంది ఇలాంటి సాంగ్ కావాలని దగ్గరుండి మరీ చేయించుకున్నారు. అలాగీ మా ఇద్దరి ఐడియాలు కూడా ఒకేలా ఉండడంతో మంచి మ్యూజిక్ వచ్చింది. ఆడియో సక్సెస్ అయ్యింది, కానీ సినిమాలో విజువల్స్ చూసిన తర్వాత సాంగ్స్ ఇంకా పెద్ద హిట్ అవుతాయి. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించాడు, అలాగే మ్యూజిక్ విషయంలో నాకు ఫుల్ ఫ్రీడం ఇచ్చి సూపర్ హిట్ ఆల్బం చేయించుకున్నాడని’ అన్నాడు.

ప్రశ్న) చివరిగా అక్కడున్న నిర్మాత, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ని ఒక్కమాటలో సినిమా గురించి చెప్పండి అంటే..

స) యూత్ అందరూ సినిమాకి వెళ్ళండి తప్పకుండా 100 కి 200% ఎంజాయ్ చేస్తారు.

అంతటితో ప్రతాప్ కొలగట్లతో మా ఇంటర్వ్యూని ముగించి సినిమా సూపర్ హిట్ కావాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము. మేము చేసిన ఈ ఇంటర్వ్యూని మీరు కూడా బాగా ఎంజాయ్ చేసారని ఆశిస్తున్నాం..

రాఘవ

 
Like us on Facebook