అమలా-విజయ్ నిజంగానే విడాకులకు సిద్ధమయ్యారా?

అమలా-విజయ్ నిజంగానే విడాకులకు సిద్ధమయ్యారా?

Published on Jul 28, 2016 7:03 PM IST

Amala-Paul-and--Vijay
సౌతిండియన్ సినిమా తారల విషయంలో దర్శకుడు ఏ.ఎల్.విజయ్, హీరోయిన్ అమలా పాల్‌లది చూడముచ్చటైన జంట అన్న పేరుంది. 2011లో ప్రేమలో పడిన ఈ ఇద్దరూ ఆ తర్వాత 2014లో పెళ్ళి అనే బంధంతో ఒక్కటయ్యారు. స్టార్ జంటల్లో ఎప్పుడూ వీరిద్దరికి మంచి క్రేజ్ కనిపిస్తూ ఉండేది. ఎంతో అన్యోన్యంగా సాగుతూ వచ్చిన వీరి వివాహ జీవితం ప్రస్తుతం ఇబ్బందులతో సాగుతోంది. కొద్దిరోజులుగా బేధాభిప్రాయాలతో అమలా, విజయ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఈ ఇద్దరూ విడాకుల వరకూ వెళ్ళినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ విడాకుల వార్త నిజమేనని విజయ్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. కొద్దికాలంగా అమలా, విజయ్‌లకు కెరీర్ విషయమై గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరూ విడాకులకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇక కెరీర్ పరంగా విజయ్, అమలా ఇద్దరూ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు