మహేష్ కెరీర్ లో ది బెస్ట్ గా నిలవనున్న ‘ఆగడు’ టైటిల్ సాంగ్

మహేష్ కెరీర్ లో ది బెస్ట్ గా నిలవనున్న ‘ఆగడు’ టైటిల్ సాంగ్

Published on Sep 18, 2014 12:30 PM IST

aagadu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా వస్తోంది అంటే ఆ సినిమాలో మహేష్ బాబుపై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ పై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవాలంటే డైరెక్టర్ కూడా సరికొత్తగా ఆలోచించాలి. అదే రీతిలో డైరెక్టర్ శ్రీను వైట్ల ఆలోచించి ఆగడు లో మహేష్ బాబు పై అదిరిపోయే రీతిలో ఆగడు ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేసారు.

మాకు ఈ చిత్ర వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ‘ఆగడు’ ఇంట్రడక్షన్ సాంగ్ మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ గా నిలుస్తుందని, పిక్చరైజేషన్ మరియు విజువల్స్ ప్రేక్షకుల మతి పోగొడతాయని’ అంటున్నారు. అలాగే సినిమాలోని మిగిలిన అన్ని సాంగ్స్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చాయని ముఖ్యంగా భెల్ పూరి, నారి నారి సాంగ్స్ లో మహేష్ డాన్సులు అదరగొట్టాడని అంటున్నారు.

కావున పాటల పరంగా ‘ఆగడు’ మహేష్ అభిమానులుకు, తెలుగు సినిమా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఆగడు గురించి మరిన్ని వివరాల కోసం123telugu.com ని విజిట్ చేస్తూ ఉండండి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు