ఊహించని స్థాయిలో రజనీ సినిమా ప్రమోషన్లు !

ఊహించని స్థాయిలో రజనీ సినిమా ప్రమోషన్లు !

Published on Jun 25, 2017 1:53 PM IST


స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ ల కలయికలో రూపొందుతున్న ‘రోబో-2’ కోసం ఊహించని స్థాయిలో ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా చెప్పబడుతున్న ఈ చిత్రాన్ని భారతీయ చిత్రంగా కాకుండా ప్రపంచస్థాయి సినిమాగా నిలబెట్టేందుకు హాలీవుడ్ లెవెల్లో ప్రచారాన్ని కల్పించాలని వినూత్న ఆలోచనతో ముందుకెళుతున్నారు టీమ్.

అందులో భాగంగానే 100 అడుగుల ఎత్తు కలిగిన హాట్ ఎయిర్ బెలూన్ ను రూపొందించారు. రజనీ, అక్షయ్ కుమార్ల లైఫ్ సైజు ఫోటోలు కలిగిన ఈ బెలూన్ మంగళవారం నుండి లాస్ ఏంజిల్స్ లో ఉన్న హాలీవుడ్ స్టూడియోస్ పై ఎగరనుంది. ఆ తర్వాత ఈ బెలూన్ ను దుబాయ్, లండన్, శాన్ ఫ్రాన్సిస్కో, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో జరిగే బెలూన్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించి ఆ తరవాత ఇండియాకు కూడా తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం తెలిపారు. మరి ఈ స్థాయిలో ప్రమోట్ చేయబడుతున్న ఈ చిత్రం 2018 జనవరి 25న విడుదలై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు