రేపటి నుండి తమిళనాట సినిమా హాళ్ళన్నీ బంద్ !

రేపటి నుండి తమిళనాట సినిమా హాళ్ళన్నీ బంద్ !

Published on Jul 2, 2017 4:26 PM IST


రేపటి నుండి తమిళనాట సినిమా హాళ్ళన్నీ మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన జీఎస్టీ విధానం ద్వారా సినిమా రంగంపై భారీ మొత్తంలో పన్నుల భారం పడింది. దీంతో సినిమా రంగానికి నష్టం తప్పేలా లేదు. దీంతో తమిళ పరిశ్రమకు చెందిన నిర్మాతలందరూ చర్చించుకుని ఈ పన్ను విధానంలో మార్పులు తేవాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం విధించిన 18 శాతం (100 రూ. లోపు టికెట్) 28 శాతం (100 రూ. ధర పైన) పన్నుతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ విధించే 30 శాతం కలుపుకుని మొత్తం 48, 58 శాతంగా పన్ను తేలింది. ఇంత భారీగా పన్నులు విడిస్తే వ్యాపారం చేయడం కష్టమని, కనుక మున్సిపల్ ట్యాక్సులను రద్దు చేయాలని, సినిమాను లీస్ట్ స్లాబు కిందికి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ రేపటి నుండి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 1,100 థియేటర్లని నిలిపివేయనున్నారు. దీని వలన ఈ వారాం విడుదలవుతున్న, గత వారం విడుదలైన సినిమాలకు తీవ్ర ష్టం తప్పేలా లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు