బేతాళుడు : రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్లో 15 నిమిషాల సినిమా!
Published on Nov 30, 2016 9:45 am IST

bethaludu
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘సైతాన్’ అనే తమిళ సినిమా తెలుగులో ‘బేతాళుడు’ పేరుతో డబ్ అయిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రేపు (డిసెంబర్ 1న) ఒకేసారి భారీ ఎత్తున సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బిచ్చగాడు’తో తెలుగులో తిరుగులేని స్టార్‌డమ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ సినిమా కావడంతో బేతాళుడుకి ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ ఆంటోనీ తీసుకుంటున్న చర్యలు ఎవ్వరి ఊహకూ అందకుండా ఆశ్చర్యపరిచేలా ఉండడం ఆసక్తికరమైన అంశంగా చెప్పుకోవాలి.

కొద్దిరోజుల క్రితం హంట్‍ఫర్ జయలక్ష్మి పేరుతో సినిమాలోని మొదటి పదినిమిషాల పార్ట్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసేసిన ఆంటోని, తాజాగా మరో 5 నిమిషాల వీడియోను విడుదల చేశారు. హంట్ ఫర్ సైతాన్ పేరుతో ఉన్న ఎపిసోడ్‌ను సరిగ్గా విడుదలకు ఒకరోజు ముందు విడుదల చేశారు. దీంతో విడుదలకు ముందే మొత్తం 15 నిమిషాల సినిమా ఇప్పుడు ఆన్‌లైన్లో ఉంది. దీన్నిబట్టి చూస్తే తన సినిమాపై విజయ్ ఆంటోనీ ఎంత నమ్మకంగా ఉన్నారో చెప్పొచ్చు. ప్రదీప్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించారు.

హంట్‌ ఫర్ జయలక్ష్మి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హంట్ ఫర్ సైతాన్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 
Like us on Facebook