సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నితిన్ – కరుణాకరన్ మూవీ..!

సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నితిన్ – కరుణాకరన్ మూవీ..!

Published on Jul 31, 2014 5:31 PM IST

nithin_karukar
‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ అట్టాక్’ చిత్రాలతో హట్రిక్ అందుకున్నాడు యువ హీరో నితిన్. హట్రిక్ విజయాల తర్వాత ప్రేమకధా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో లవ్ & రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేటితో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. టోటల్ 50% సినిమా షూటింగ్ పూర్తి చేశారు.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో నితిన్ సరసన హిందీ హీరోయిన్ మిస్తీ చక్రవర్తి నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నితిన్ సోదరి నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు