‘అ..ఆ..’, ‘జెంటిల్‌మన్’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్!

‘అ..ఆ..’, ‘జెంటిల్‌మన్’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్!

Published on Jun 25, 2016 1:23 PM IST

gentleman

ఈ వేసవి సీజన్ చివర్లో జూన్ నెలలో, రెండు వారాల తేడాలో విడుదలైన ‘అ..ఆ..’, ‘జెంటిల్‌మన్’ సినిమాలు అంతటా మంచి కలెక్షన్స్ సాధిస్తూ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఈ రెండు సినిమాలూ యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయి హిట్ కొట్టడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ..’ జూన్ 2న విడుదలై ఇప్పటికీ మంచి కలెక్షన్స్‌నే రాబడుతూ వస్తోంది. మూడోవారం పూర్తయ్యేసరికి అమెరికాలో ఈ సినిమా 2.4 మిలియన్ డాలర్లు (సుమారు 16.33కోట్ల రూపాయలు) వసూలు చేసి తెలుగులో ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఇక నాని హీరోగా నటించిన జెంటిల్‌మన్ కూడా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌నే రాబడుతూ 1 మిలియన్ సాధించే దిశగా వెళుతోంది. మొదటి వారం పూర్తయ్యే సరికి ఈ సినిమా యూఎస్‌లో 650కే డాలర్లు (సుమారు 4.33కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఈ వారం కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడం జెంటిల్‌మన్‌కు కలిసొచ్చే అంశం. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్‌మన్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్స్ పరంగా సత్తా చాటుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు