వైవిధ్యంగా అ..ఆ మూవీ ప్రమోషన్స్..!

వైవిధ్యంగా అ..ఆ మూవీ ప్రమోషన్స్..!

Published on May 27, 2016 4:07 AM IST

a.aa_
తివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ’అ..ఆ..’.. సినిమా విడుదలకు రంగం సిద్ధంచేసుకుంటున్నది. అందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తిగా వైవిధ్యంగా ఉండేటట్టు దర్శకుడు తివిక్రమ్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఇందులో భాగంగా తివిక్రమ్ సారథ్యంలో రికార్డ్ చేసిన ఇంటర్వ్యూలను టివి మీడియాకి అందజేయబోతున్నట్లు సమాచారం. ఈ ఇంటర్వ్యూలన్నీ పూర్తిస్థాయిలో వినోదభరితంగా ఉండబోతున్నట్లు తెలిసింది. సాధారణంగా ఉండే ప్రశ్నలకు సమాధానం చెప్పేవిధంగా కాకుండా ఆకట్టుకునేరీతిలో పూర్తిగా వైవిధ్యంగా ఈ ప్రోగ్రామ్ ని రూపొందించినట్టు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు