మే నెలాఖర్లో త్రివిక్రమ్-నితిన్‌ల ‘అ..ఆ..’!

మే నెలాఖర్లో త్రివిక్రమ్-నితిన్‌ల ‘అ..ఆ..’!

Published on Apr 28, 2016 10:41 PM IST

a..aa
మాటలతో మ్యాజిక్ చేసే దర్శకుడు త్రివిక్రమ్, లవర్ బాయ్ నితిన్, స్టార్ హీరోయిన్ సమంతల క్రేజీ కాంబినేషన్‌లో ‘అ..ఆ..’ పేరుతో ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. మే 2న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక హైద్రాబాద్‌లో వైభవంగా జరగనుంది. ఇక మే 6న సినిమా విడుదలవుతుందని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన టీమ్, తాజాగా ఆ తేదీ నుంచి తప్పుకోవడమే కాక, మూడో వారంలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటూ వస్తోంది.

అయితే తాజాగా మే మూడోవారానికే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ ఫిక్స్ అయిపోవడంతో, తాజాగా ‘అ..ఆ..’ టీమ్ మరో తేదీ కోసం సన్నాహాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే మే 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 27కే ‘అ..ఆ..’ విడుదలైతే ఈ వేసవికి మిగిలిపోయిన భారీ క్రేజ్ ఉన్న సినిమాలు రెండు ఒకేవారం తేడాలో విడుదలయ్యే పరిస్థితి ఎదురవుతుంది. మే 27వ తేదీ కుదరకపోతే జూన్ 3న ‘అ..ఆ..’ విడుదలయ్యే అవకాశం ఉంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు