మిలియన్ వ్యూస్ దాటిన ’అ…ఆ’ ట్రైలర్..!

మిలియన్ వ్యూస్ దాటిన ’అ…ఆ’ ట్రైలర్..!

Published on May 6, 2016 12:29 PM IST

a.aa_
నితిన్, సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన ‘అ..ఆ..’ సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నాలుగు రోజుల క్రితం విడుదల చేశారు. ఇప్పటివరకూ ఈ సినిమా ట్రైలర్ ని యూ ట్యూబ్ లో పది లక్షల మందికి పైగానే చూడటం విశేషం.

ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే…94 సెకన్లు ఉన్న ’అ..ఆ’ ట్రైలర్ మొత్తం 46 షాట్స్ తో కట్ చేశారు. ట్రైలర్ మొదటి షాట్ ఏరియల్ షాట్ తో మొదలవుతుంది. సమంత చెప్పే ’ఇద్దరి గురించి కథ చెప్పాలంటే.. మూడు భాగాలుగా చెప్పొచ్చు.. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్’ అనే మాటలతో ప్రారంభం అవుతుంది. మొదటి 20 సెకన్లు సరదాగా సాగిన ఈ ట్రైలర్ ఆ తరువాత 40 సెకనులో పూర్తిగా ఉల్లాసభరితంగా ఆఖరిలో ఎమోషనల్ గా మారుతుంది. అమ్మోరికత్తిలా అనుపమ పరమేశ్వరన్, ఆవులిస్తూ అవసరాల శ్రీనివాస్ లతో పాటు రావు రమేష్, నదియా, అనన్య లు ఆకట్టుకుంటారు. ’లవ్ చేసేంత లక్జరీ లేదు… వదిలేసేంత లెవలూ లేదు’ అనే మాటలతో పాటు ’గోపాల గోపాల అలకేలరా దీపాలా వేళాయ కనిపించరా.. చీకటి వేళకి నీ పంచన.. చేరని మనసిది శమించునా… అన్న పాటలో నేపథ్య గాయని భావయుక్తంగా పాడిన పాటకు ఉపయోగించిన ఇన్స్రుమెంటేషన్ ఆకట్టుకోవడంతో పాటు మనసుకు హత్తుకుంటుంది.

నితిన్ నటన, సమంత మూతి విరుపులు, తివిక్రమ్ చమక్కులు, మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం, నటరాజన్ సుబ్రమణ్యన్ లైటింగ్ స్కీమ్, కళాదర్శకుడి గా ఏ యస్ ప్రకాష్ పనితనం ఆకట్టుకుంటాయి. మోహనం, సమ్మోహనం లా కుటుంబ కథాచిత్రంలో ప్రేమ కథ మిళితమైనట్టుంది. కళ్లకి హాయినిచ్చే రంగులు, చెవికి ఇంపైన సంగీతం, మనసుని తట్టి లేపే మాటలు… ​ఇలా అన్నిటి సమ సమ్మేళనంతో ​’అ…ఆ ట్రైలర్’ అనిర్వచనీయ అనుభూతి ఇవ్వడంతో పాటు మొత్తానికి ముచ్చట గొలిపి ముద్దొచ్చేలా ఉండటంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఈ సినిమా అంచనాలను పెంచేస్తున్నది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు