‘అ..ఆ..’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

‘అ..ఆ..’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

Published on May 25, 2016 2:07 PM IST

a.aa_
‘అ..ఆ..’.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ వేసవికి భారీ క్రేజ్ ఉన్న సినిమాలన్నీ విడుదలయ్యాక, ఆ స్థాయి క్రేజ్‍తో విడుదలకు సిద్ధంగా ఉన్న ఏకైక సినిమా. దర్శకుడు త్రివిక్రమ్, నితిన్, సమంతల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోగా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని విడుదలకు పక్కాగా సిద్ధమైపోయింది. సెన్సార్ బృందం ఈ సినిమాకు ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది.

ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయిపోవడంతో, రేపట్నుంచి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. త్రివిక్రమ్, నితిన్, సమంత స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారు. త్రివిక్రమ్ మార్క్ భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించారు. మళయాలంలో ‘ప్రేమమ్’ సినిమాతో సంచలనం సృష్టించిన అనుపమ పరమేశ్వరన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు