జనవరి 1న వస్తున్న ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’

జనవరి 1న వస్తున్న ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’

Published on Dec 22, 2014 12:09 PM IST

a-shyam-gopal-varma-film

ప్రముఖ నటుడు షఫీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’. నా సినిమా నా ఇష్టం అనేది ఉపశీర్షిక. రాకేశ్ శ్రీనివాస్ దర్శకుడు. ముందుగా ప్రకటించినట్టు జనవరి 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.2015లో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలతో పాటు సెన్సార్ ఫార్మాలిటీస్ ఇటీవలే పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘యు/ఎ’ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది.

సెటైరికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షఫీ దర్శకుడి పాత్రలో నటించారు. షఫీ సరసన జోయాఖాన్ కథానాయికగా నటించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని సినిమా యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్, ట్రైలర్ ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేపాయి. సమిష్టి క్రియేషన్స్ పతాకంపై విజయ్ కుమార్ రాజు, రాకేశ్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు