నాగ చైతన్య నుండి అభిమానులకో సప్రైజ్ !

నాగ చైతన్య నుండి అభిమానులకో సప్రైజ్ !

Published on Jul 26, 2017 5:24 PM IST


‘రారండోయ్ వేడుక చూద్దాం’ సక్సెస్ ను మర్చిపోక ముందే హీరో నాగ చైతన్య మరొక సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్దమైపోయాడు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు కృష్ణ ఆర్వి మరిముత్తు దర్శకత్వంలో ‘యుద్ధం శరణం’ అనే సినిమా చేస్తున్నాడు. టైటిల్, ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై మంచి క్రేజ్ నెలకొనగా సీనియర్ హీరో శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్ గా నటిస్తుండటం ఇంకాస్త కిక్ ఇచ్చే విషయమైంది.

ఇలా పలు సప్రైజింగ్ అంశాలను కలిగిన ఈ సినిమా గురించి ఇంకో సప్రైజింగ్ విషయాన్ని హీరో నాగ చైతన్య రేపు ఉదయం 10 : 30 గంటలకు ప్రకటించనున్నారు. ఈ అంశం అభిమానులకు కిక్ ఇచ్చేదిగా
ఉంటుందని అంటున్నారు. వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, రేవతిలు పలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు