“కార్తికేయ 2” నుంచి థ్రిల్లింగ్ అప్డేట్ రాబోతుంది.!

“కార్తికేయ 2” నుంచి థ్రిల్లింగ్ అప్డేట్ రాబోతుంది.!

Published on Mar 7, 2021 2:00 PM IST

“స్వామి రారా” సినిమా నుంచి టోటల్ తన సినిమా సబ్జెక్టు స్టైల్ నే మార్చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ. అక్కడ నుంచి మంచి ఎక్స్ పెరిమెంటల్ మరియు థ్రిల్లింగ్ సినిమాలు చూడాలంటే తాను ముందు మంచి ఛాయిస్ గా నిలిచేవాడు. అలా ఇప్పటికీ మంచి మంచి ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. అయితే నిఖిల్ ఇప్పటి వరకు చేసిన ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన “కార్తికేయ” కూడా ఒకటి.

బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను కూడా రాబట్టిన ఈ చిత్రంకు సీక్వెల్ ను కూడా మేకర్స్ గత ఏడాది అనౌన్స్ చేశారు. అలా అప్పుడు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ టీజర్ కు కూడా భారీ రెస్పాన్స్ రాగా ఇపుడు మేకర్స్ మరో థ్రిల్లింగ్ అప్డేట్ ను రివీల్ చేస్తున్నట్టుగా తెలుపుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈ అప్డేట్ ఏంటా అన్నది చూడాలి. ఈ సినిమా కోసం మాత్రం థ్రిల్లర్ సినిమా అభిమానులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు