‘ఆచారి అమెరికా యాత్ర’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్డేట్ !

‘ఆచారి అమెరికా యాత్ర’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్డేట్ !

Published on Jan 19, 2018 3:00 PM IST


మంచు విష్ణు హీరోగా, జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ . గతంలో జి. నాగేశ్వర్ రెడ్డి, మంచు విష్ణుల కాంబినేషన్లో ‘దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం’ సినిమాలు వచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా కూడా అదే తరహా విజయం సాధించే అవకాశాలున్నాయి. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

తమన్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ పలువురు సినీ ప్రముఖుల మద్య జరగబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. విక్రమ్ రాజ్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకు డార్లింగ్ స్వామి మాటలు రాశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు