కీర్తి సురేష్ ‘సఖి’ రిలీజ్ కి రెడీ అయింది !

కీర్తి సురేష్ ‘సఖి’ రిలీజ్ కి రెడీ అయింది !

Published on Feb 28, 2021 11:28 PM IST

మహానటి తరువాత కీర్తి సురేష్ ఫేమ్ డబుల్ అయ్యింది. ఆ చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపించగా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బెస్ట్ ఛాయిస్ గా మేకర్స్ కీర్తి సురేష్ ని భావిస్తున్నారు. దీనితో వరుసగా ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో గుడ్ లక్ సఖి అనే మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ ఉండాల్సిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలోకి రానుంది.

కాగా గుడ్ లక్ సఖి థియేట్రికల్ విడుదల తేదీని రేపు (మార్చి 1) ఉదయం 9 గంటలకు ప్రకటించనున్నారు. మరో వైపు కీర్తి సురేష్ నితిన్ కి జంటగా నటించిన రంగ్ దే విడుదలకు రెడీ అవుతుంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. అలాగే సూపర్ స్టార్ మహేష్ హీరోగా దర్శకుడు పరుశురాం తెరకెక్కించనున్న సర్కారు వారి పాట మూవీలో కూడా కీర్తి హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు