ఈనెల్లోనే సెట్స్‌పైకి ఆది ‘చుట్టాలబ్బాయ్’!

ఈనెల్లోనే సెట్స్‌పైకి ఆది ‘చుట్టాలబ్బాయ్’!

Published on Aug 3, 2015 9:14 PM IST

aadi
‘అహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలతో కామెడీ సినిమా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రం, మూడో సినిమా ‘భాయ్’ పరాజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. తాజాగా ఆయన లవర్ బాయ్ ఆది హీరోగా ‘చుట్టాలబ్బాయ్’ పేరుతో ఓ సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. గత నెలలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి.

ఇక నిన్న చెన్నైలో చుట్టాలబ్బాయ్ సినిమా యూనిట్ సినిమా విశేషాలను తెలియజేసింది. కామెడీ కమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఈ నెలాఖర్లోనే సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నట్లు నిర్మాత వెంకట్ తెలిపారు. మేజర్ షూటింగ్ వచ్చే నెలలో జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ఆది సరసన ప్రణీత హీరోయిన్‌గా నటించనుంది. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది ప్రస్తుతం ‘గరమ్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు