‘రఫ్’ మూవీ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న ఆది.

‘రఫ్’ మూవీ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న ఆది.

Published on Oct 24, 2014 3:45 PM IST

aadi-in-rough
‘ప్రేమ కావాలి’ వంటి హిట్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచమైన సాయి కుమార్ తనయుడు, యువ హీరో ఆది కెరీర్ అంత ఆశాజనకంగా సాగడం లేదు. మధ్యలో ‘లవ్లీ’, ‘గాలిపటం’ సినిమాలు విమర్శకులను మెప్పించినా, ఆదికు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించలేకపోయాయి. తాజాగా నటించిన ‘రఫ్’ సినిమా తనకు బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందని ఆది నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా విజయంపై చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. ఆది నటించిన ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఈ సినిమా కోసం బాడీని బాగా బిల్డ్ అప్ చేశాడు. ఫైట్స్ సినిమాలో హైలైట్ అవుతాయని భావిస్తున్నారు.

తెలుగులో వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ గా ముద్రపడ్డ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో ఆది సరసన నటించడం ‘రఫ్’కు మరో ప్లస్ పాయింట్. స్వరబ్రహ్మ మణిశర్మ ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు