పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఆది ‘గరం’

పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఆది ‘గరం’

Published on Jul 3, 2015 8:29 AM IST

garam
డైలాగ్ కింగ్ సాయి కుమార్ నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో ఆది ప్రేమ కావాలి’, ‘లవ్లీ’, ‘గాలిపటం’ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఆది చేస్తున్న ఏడవ సినిమా ‘గరం’. గతంలో ‘పెళ్ళైన కొత్తలో’, ‘గుండె ఝల్లుమంది’. ‘ప్రవరాఖ్యుడు’ సినిమాల డైరెక్టర్ మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆది ఇప్పటికే తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసాడు. మిగతా షూటింగ్ కూడా పూర్తయ్యింది. దాంతో ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేసారు. ప్రస్తుతం జోరుగా ఈ మూవీ డబ్బింగ్, రీ రికార్డింగ్, ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి.

ఆది ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘మొదటిసారి నా కెరీర్లో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేస్తున్నాను. ఈ సినిమాలో మేము చూపించే పాయింట్ ప్రతి ఒక్క ఇంట్లోనూ జరుగుతుంది, అందుకే ఈ మూవీ పక్కాగా అందరికీ నచ్చుతున్న కాన్ఫిడెంట్ తో ఉన్నానని’ ఆది అన్నాడు. ఆది సరసన ‘హార్ట్ ఎటాక్’ ఫేం అదా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. యం.రాజ్ కుమార్ ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా పూర్తవడంతో ఆది తన తదుపరి సినిమా వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు