ఈ యంగ్ హీరో ఈసారి హిట్ కొట్టి తీరాల్సిందే !

ఈ యంగ్ హీరో ఈసారి హిట్ కొట్టి తీరాల్సిందే !

Published on Sep 19, 2017 1:58 PM IST


యంగ్ హీరోకి ఆది ‘సుకుమారుడు’ తర్వాత మెప్పించే సినిమాలేవీ చేయలేదు. ‘గాలిపటం, రఫ్, గరం, చుట్టాలబ్బాయి’ వంటి సినిమాలు వరుసగా ఫ్లాపవగా ఈ మధ్య చేసిన మల్టీస్టారర్ ‘శమంతకమణి’ కాస్త ఊరటనిచ్చినా సోలో హీరోగా తప్పక విజయాన్నందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తాజా చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ ట్రైలర్ చూస్తే ఆది ఈ విషయాన్నే బాగా అర్థం చేసుకున్నట్టు తెలుస్తోంది.

రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాను ఫాలో అయి రొటీన్ సినిమాను ఇచ్చే కన్నా కాస్త జానర్ మార్చి, కథకు ప్రాధాన్యమిచ్చి ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుందని భావించిన ఆది తమిళ హిట్ మూవీ ‘యామిరుక్క భయమే’ తెలుగు రీమేక్ ‘నెక్స్ట్ నువ్వే’ ను చేశారు. ట్రైలర్ కూడా ఎంటర్టైన్మెంట్ నిండి బాగుండటంతో 24 గంటల్లోనే 1.5 మిలియన్ వ్యూస్ దక్కాయి. ప్రేక్షకుల్లో కూడా ఆది ఈసారి ఏదో కొత్తగా ట్రై చేశారు అనే నమ్మకం కలుగుతోంది. ఈ నమ్మకాన్ని ఆది ఎంత వరకు నిలబెట్టుకుంటారో నవంబర్ 3న చిత్ర విడుదలతో తేలిపోనుంది. గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తుండగా ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి:

సంబంధిత సమాచారం

తాజా వార్తలు