అనుష్క సినిమాలో ఆది రోల్ ఇదే !

అనుష్క సినిమాలో ఆది రోల్ ఇదే !

Published on Jan 18, 2018 4:50 PM IST

బాహుబలి సినిమా తరువాత అనుష్క నటిస్తున్న మూవీ భాగమతి. పిల్ల జమిందార్ సినిమాకు దర్శకత్వం వహించిన జి.అశోక్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు. జనవరి 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టిజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా లో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆది పినిశెట్టి ఈ సినిమాలో నటిస్తోన్న విషయం ఎక్కడా ప్రస్తావించలేదు చిత్ర యూనిట్. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా లో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించంబోతోంది. అనుష్క లీడ్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు