ఆగష్టు 30న ఆగడు ఆడియో

ఆగష్టు 30న ఆగడు ఆడియో

Published on Aug 22, 2014 11:33 PM IST

aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. శ్రీను వైట్ల ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘దూకుడు’ సినిమాని మించి ఈ చిత్రం వుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో ఈ నెల 30వ తారీఖున విడుదలకానుంది. హైదరాబాద్ లో మాదాపూర్ దగ్గరున్న శిల్పారామంలో ఈ వేడుక జరగనుంది. పలువురు సినిమా ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నట్టు సమాచారం.

థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మహేష్ సరసన తమన్నా నటించింది. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాకు నిర్మాత

సంబంధిత సమాచారం

తాజా వార్తలు