నార్త్ ఇండియాలోనూ రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఆగడు’

నార్త్ ఇండియాలోనూ రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఆగడు’

Published on Sep 20, 2014 1:45 PM IST

aagadu
ఈ శుక్రవారం తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి బాక్స్ ఆఫీసు వద్ద రిలీజ్ అయిన సినిమా ‘ఆగడు’. సూపర్ స్టార్ మహేష్ బాబు – మిల్క్ బ్యూటీ తమన్నా జోడీ కట్టిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. విడుదలకి ముందు నుంచే రికార్డ్స్ సృష్టిస్తున్న ఆగడు రిలీజ్ అయిన తర్వాత కూడా రికార్డ్స్ సృష్టిస్తోంది.

మామూలుగా ప్రతి తెలుగు సినిమా నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది. కానీ తక్కువ స్క్రీన్స్ లో షోస్ వేస్తారు కానీ ఆగడు’ని మాత్రం మొదటి రోజు నార్త్ ఇండియాలో 199 స్క్రీన్స్ లో వేసారు. ఓ తెలుగు సినిమా నార్త్ ఇండియాలో ఈ రేంజ్ స్క్రీన్స్ లో షోస్ పడడం ఇదే మొదటిసారి. కాబట్టి నార్త్ ఇండియా పరంగా కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంటాయని ఆశించవచ్చు.

మహేష్ ఈ సినిమాలో చూపిన వైవిధ్యం మరియు రాయలసీమ యాస డైలాగ్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే శృతి హాసన్ స్పెషల్ సాంగ్ కూడా సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు