బాలీవుడ్ లో ఎంకౌంటర్ శంకర్ గా మహేష్ ‘ఆగడు’

బాలీవుడ్ లో ఎంకౌంటర్ శంకర్ గా మహేష్ ‘ఆగడు’

Published on Oct 22, 2014 4:10 PM IST

Aagadu-wallpapers
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా సందడి చెయ్యనప్పటికీ బాలీవుడ్ లో మహేష్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ఎంకౌంటర్ శంకర్ గా అనువదించనున్నారు. మహేష్ గత చిత్రాలన్నీ హిందీలో డబ్ అయ్యాయి. ఆగడు సినిమాను బాలీవుడ్ లో అగ్రతారలు రీమేక్ చేయ్యబోమని ఇప్పటికే స్పష్టం చేసారు

ఈ డబ్బింగ్ హక్కులను ఫ్యాన్సీ ధరకు రివాజ్ దుగ్గల్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం నవంబర్ లో విడుదలకానుంది. శ్రీనువైట్ల తెరకెక్కించిన రెడీ సినిమా హిందీలో రీమేక్ అయ్యి మంచి విజయం సాధించిన విషయం తెలిసినదే

సంబంధిత సమాచారం

తాజా వార్తలు