ఇండియా మొత్తంగా అప్లోడ్ అయిన 1005 డిజిటల్ ప్రింట్స్.!

ఇండియా మొత్తంగా అప్లోడ్ అయిన 1005 డిజిటల్ ప్రింట్స్.!

Published on Sep 18, 2014 11:42 PM IST

aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా రిలీజ్ కి అన్ని పనులు పూర్తయ్యాయి. ఆగడు సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా 2000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అందులో 225 స్క్రీన్స్ లో ఇతర దేశాల్లో షోస్ వేసారు. వీటికి సంబందించిన డిజిటల్ ప్రింట్స్ కూడా ఇప్పటికే అప్లోడ్ అయిపోయాయి.

ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియా వ్యాప్తంగా 1005 డిజిటల్ ప్రింట్స్ అప్లోడ్ అయిపోయాయి. అందులో క్యూబ్ ద్వారా 450 డిజిటల్ ప్రింట్స్, యుఎఫ్ఓ ద్వారా 300 డిజిటల్ ప్రింట్స్, స్క్రాబుల్ ద్వారా 150 డిజిటల్ ప్రింట్స్, పిఎక్స్డి ద్వారా 105 డిజిటల్ ప్రింట్స్ అప్లోడ్ అయ్యాయి. కావున ఇండియా వ్యాప్తంగా కూడా రిలీజ్ లో ఎటువంటి ఆలస్యం ఉండదు. అలాగే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు వెళ్ళాల్సిన ఫిజికల్ ప్రింట్స్ కూడా రీచ్ అయిపోయాయి.

మహేష్ బాబు – తమన్నా మొదటి సారి జోడీ కట్టిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ ఫ్యాన్స్ షోస్ కి సంబందించిన ఏర్పాట్లు కూడా జోరుగా జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు