రొమాన్స్ లో బిజీగా ఉన్న అనుష్క – ఆర్య

రొమాన్స్ లో బిజీగా ఉన్న అనుష్క – ఆర్య

Published on Jul 3, 2015 2:21 PM IST

aarya-anushka
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోస్ తో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ యోగ బ్యూటీ అనుష్క. దానికి కారణం అనుష్క కేవలం స్టార్స్ సరసన హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా తన టాలెంట్ ని నిరూపించుకోవడం. ఇదేకోవలోనే అనుష్క చేస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘జీరో సైజ్’. రెండు నెలల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతోంది. గత కొద్ది రోజులుగా అనుష్క – ఆర్యలపై వచ్చే లవ్ సీన్స్, లవ్ ప్రపోజల్ సీన్స్ తీస్తున్నారు.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కీలక మైన సీన్స్ అని ఈ చిత్ర టీం తెలిపింది. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అనుష్క కూడా ఈ సినిమా కోసం కంటిన్యూ గా షూటింగ్ ఫినిష్ చేస్తోంది. ఈ సినిమాలో అనుష్క రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనుంది. అందులో ఓ పాత్ర కోసం 20 కేజీల బరువు కూడా పెరిగింది. పివిపి సినిమాస్ బ్యానర్ లో పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్. ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే గ్లామరస్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించడమే కాకుండా ఓ స్పెషల్ సాంగ్ లో కూడా స్టెప్పులేయనుంది.

స్వచ్చమైన ప్రేమకి ఫిజికల్ బ్యూటీతో అవసరం లేదు అనే కాన్సెప్ట్ తో రానున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో భరత్, ఊర్వసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ – స్క్రీన్ ప్లే అందించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు