లవర్స్ డే కానుకగా నితిన్ – సమంతల ‘అ..ఆ’

లవర్స్ డే కానుకగా నితిన్ – సమంతల ‘అ..ఆ’

Published on Oct 5, 2015 3:37 PM IST

nitin-and-trivikram
మాటలతో థియేటర్ లో ఆడియన్స్ ని మాయ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ – యంగ్ హీరో నితిన్ లు కలిసి ఓ క్రేజీ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యారు. అంతే కాకుండా ‘అ..ఆ’ అనే వెరైటీ టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ కూడా చేసారు. ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ అనేది ఈ టైటిల్ కి ఉపశీర్షిక. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ఇదివరకే తెలియజేశాం. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఫస్ట్ షెడ్యూల్ కోసం సిద్దమవుతున్నారు.

ఈ సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు కంటిన్యూగా షూట్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట. ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ఆసీజన్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఈ చిత్ర టీం భావిస్తున్నట్లు సమాచారం. నితిన్ సరసన అందాల భామ సమంతతో పాటు తమిళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా హీరోయిన్ గా కనిపించనుంది. అక్టోబర్ 10 నుంచి కంటిన్యూగా 3 నెలల పాటు కంటిన్యూగా షూటింగ్ ని చేసి ఈ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎస్ రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా ద్వారా అనిరుద్ తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు