చరణ్ పై మునుపెన్నడూ లేని విధంగా ఈ సీక్వెన్స్..?

చరణ్ పై మునుపెన్నడూ లేని విధంగా ఈ సీక్వెన్స్..?

Published on Mar 3, 2021 7:08 AM IST

అభిమానులు మిస్టర్ బాక్స్ ఆఫీస్ గా పిలుచుకునే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు రెండు భారీ మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న “ఆచార్య” కూడా ఒకటి. అయితే ఇందులో ‘సిద్ధ’ అనే పవర్ ఫుల్ రోల్ లో చరణ్ ని చూపిస్తున్నారు. అయితే ఈ రోల్ పట్ల మాత్రం ఇప్పుడు అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి.

పైగా లేటెస్ట్ టాక్ ఏమిటంటే ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో చరణ్ పై ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే అతని కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలుస్తుంది అని మెగా వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మాత్రం చరణ్ రాకతో కొత్త ఊపు ఈ సినిమాకు వచ్చింది. మరి ఈ మాస్ హిస్టీరియా ఎలా ఉండబోతోందో తెలియాలి అంటే వచ్చే మే 13 వరకు ఆగాల్సిందే..ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు