పరిగెత్తించే స్క్రీన్ ప్లే తో రానున్న ‘డైనమైట్’

పరిగెత్తించే స్క్రీన్ ప్లే తో రానున్న ‘డైనమైట్’

Published on Aug 29, 2015 10:39 PM IST

Dynamite
‘రౌడీ’, ‘అనుక్షణం’, ‘ఎర్రబస్సు’ ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని కథలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నా యంగ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’. పెర్ఫార్మన్స్ కి, ఇంటెన్స్ ఉన్న సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రణిత హీరోయిన్ గా నటించింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మంచు విష్ణు చేసిన రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ సినిమాకి హైలైట్ కానున్నాయని ఇది వరకే తెలియజేశాం. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఈ సినిమాలో మరో పాయింట్ కూడా హైలైట్ కానుంది.

అదేమిటంటే డైనమైట్ స్క్రీన్ ప్లే చాలా స్పీడ్ గా ఉండనుంది. సినిమా మొదటి నుంచి చివరి దాకా పరిగెడుతూ ఉంటుంది. ఈ స్పీడ్ స్క్రీన్ ప్లే వలన సినిమా చూసే ఆడియన్స్ సీట్ చివర్లో కూర్చొని నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేలా ఈ సినిమాని చూస్తారు. దానివల్ల ఆడియన్స్ కి సినిమా చాలా బాగా నచ్చుతుందని ఈ చిత్ర టీం అంటోంది. మంచు విష్ణుతో పాటు ప్రణిత కూడా రియలిస్టిక్ స్టంట్స్ చేసిన ఈ సినిమాలో జెడి చక్రవర్తి మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. సెప్టెంబర్ 4న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు