యాక్షన్ హీరో గోపీచంద్ “సీటీమార్” రిలీజ్ డేట్ వచ్చేసింది.!

యాక్షన్ హీరో గోపీచంద్ “సీటీమార్” రిలీజ్ డేట్ వచ్చేసింది.!

Published on Jan 28, 2021 1:00 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ టాలెంటెడ్ అండ్ అండర్ రేటెడ్ హీరోల్లో యాక్షన్ హీరో గోపీచంద్ కూడా ఒకరు. అయితే గోపీచంద్ హీరోగా చేసిన పలు ఆసక్తికర చిత్రాల్లో బోల్డ్ అటెంప్ట్ “గౌతమ్ నంద” కూడా ఒకటి. బాక్సాఫీస్ పరంగా సినిమా ఆకట్టుకోకపోయినప్పటికే సినీ ప్రేమికుల మన్ననలు అందుకుంది.

మరి అలనాటి చిత్రాన్ని అందించిన దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “సీటీమార్”. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఫైనల్ గా ఈ చిత్రానికి ఒక రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ 2వ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేసేసారు. ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా భూమికా చావ్లా కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు