నితిన్‌కు విలన్‌గా నాటితరం స్టార్ హీరో!

నితిన్‌కు విలన్‌గా నాటితరం స్టార్ హీరో!

Published on Jan 16, 2017 5:16 PM IST

Arjun
‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి, తన కొత్త సినిమాను హీరో నితిన్‌తో చేస్తోన్న విషయం తెలిసిందే. ‘అ..ఆ..’ లాంటి మంచి విజయం తర్వాత ఆ స్థాయికి తగ్గ సినిమాయే చేయాలన్న ఆలోచనతో నితిన్, చాలా గ్యాప్ తీసుకొని హను రాఘవపూడి సినిమా మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సినిమా రేపట్నుంచి మరో షెడ్యూల్ జరుపుకోనుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాటితరం స్టార్ హీరోల్లో ఒకరైన అర్జున్ విలన్‌గా నటిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు స్టార్‌గా వెలుగొందిన అర్జున్, కొద్దికాలంగా విలన్ తదితర హీరో స్థాయి ఉన్న ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నితిన్ సినిమాలో విలన్‌గా చేస్తున్నారు. నితిన్-అర్జున్‌ల మధ్యన వచ్చే సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయట. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు