‘ఆర్ఆర్ఆర్’లోనే ఆ సీక్వెన్స్ హైలైట్ అట !

‘ఆర్ఆర్ఆర్’లోనే ఆ సీక్వెన్స్ హైలైట్ అట !

Published on Jan 25, 2020 11:00 PM IST

జూ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది. ఎన్టీఆర్ – చరణ్ కలయికలో ప్రత్యర్థుల పై చేసే యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. ఈ సీన్స్ క్లైమాక్స్ సీక్వెన్స్ లో వస్తాయని.. అడవిలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. కాగా వచ్చే వారం నుండి ఈ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారట. కాగా ఇప్పటికే 80% షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటుల్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ధృడంగా ఉండే కొమరం భీంగా కనిపించేందుకు ఇప్పటికే లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కసరత్తులు కూడా చేశాడు. జులై 30, 2020 లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు