తెలుగులో మరో సినిమా చేస్తానన్న తమిళ హీరో

తెలుగులో మరో సినిమా చేస్తానన్న తమిళ హీరో

Published on Sep 24, 2016 8:44 PM IST

Karthi
తమిళ హీరోల్లో చాలా మంది మన తెలుగు పరిశ్రమకు మంచి గౌరవం, విలువ ఇస్తుంటారు. కోలీవుడ్ లో స్టార్ హీరోల హోదాలో ఉన్నప్పటికీ తెలుగు పరిశ్రమలో గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నించి చాలా మంది సక్సెస్ అయ్యారు కూడ. అలా సక్సెస్ చూసిన వారిలో హీరో కార్తీ కూడా ఒకరు. ‘ఆవారా, నా పేరు శివ, యుగానికొక్కడు, ఊపిరి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కార్తి తెలుగులో ఒక డైరెక్ట్ సినిమా చేస్తానంటున్నాడు.

ఇటీవల హైదరాబాదా లో జరిగిన ఓ కార్యక్రమంలో కార్తి ఈ మాట చెప్పాడు. నాగార్జునగారితో కలిసి ‘ఊపిరి’ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని, ఈ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనని, త్వరలో తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలనుకుంటున్నానని, ఖచ్చితంగా చేస్తానని అన్నారు. కానీ ఎవరితో, ఎప్పుడు అనే విషయం మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం కార్తి మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న ‘కాట్రు వెలియిదై’, గోకుల్ డైరెక్షన్లో చేస్తున్న ‘కాష్మోరా’ వంటి చిత్రాలు తెలుగులో కూడా రిలీజ్ కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు