ఎండను లెక్కచేయకుండా షూటింగ్‌తో రామ్ బిజీ!

ఎండను లెక్కచేయకుండా షూటింగ్‌తో రామ్ బిజీ!

Published on May 26, 2015 10:23 PM IST

ram33
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ‘పండగ చేస్కో’ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన రామ్, ఆ వెంటనే మరో రెండు సినిమాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ‘శివం’, ‘హరికథ’ పేర్లతో తెరకెక్కుతోన్న ఈ రెండు సినిమాలనూ రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. రెండు వరుస పరాజయాల తర్వార రామ్ డిఫరెంట్ కథలతో సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే ‘పండగ చేస్కో’, ‘శివం’, ‘హరికథ’ ఇలా దేనికవే డిఫరెంట్ సినిమాలతో బిజీబిజీగా మారిపోయాడు. ‘శివం’ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు కాగా, ‘హరికథ’ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ‘శివం’ సినిమా షూటింగ్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఎండను సైతం లెక్క చేయకుండా సినిమా యూనిట్ షూటింగ్ చేస్తోంది. “కర్నూలుకు దగ్గర్లో.. ఎండలో.. ఈ లైట్ల నుంచి వచ్చే వేడిలో షూటింగ్. అయినా ఎంజాయ్ చేస్తూ షూటింగ్‌లో పాల్గొంటున్నా” అంటూ ఓ ఫోటోను ట్వీట్ చేశాడు రామ్. ఇక రామ్ ‘పండగ చేస్కో’ మే 29న విడుదల కానున్న విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు