రిలీజ్‌కు ముందే పది నిమిషాల సినిమా ఆన్‌లైన్‌లో..!
Published on Nov 18, 2016 4:03 am IST

VIJAY-ANTONY
‘బిచ్చగాడు’ అనే ఒకే ఒక్క సినిమాతో తెలుగులో హీరోగా స్టార్‌డమ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ, తాజాగా ‘సైతాన్’ అనే సినిమాతో వస్తోన్న తెలిసిందే. తమిళంలో భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాను తెలుగులో ‘బేతాళుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ట్రైలర్‌తో ఇక్కడ కూడా విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక అన్నీ కుదిరితే ఈ శుక్రవారమే విడుదల కావాల్సిన ఈ సినిమా, కరన్సీ బ్యాన్ వల్ల వాయిదా పడింది.

దీంతో సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గకూడదన్న ఆలోచనతో విజయ్ ఆంటోనీ ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తమిళ వర్షన్‌కు సంబంధించిన మొదటి పది నిమిషాల ఓపెనింగ్ సీక్వెన్స్‌‌ను విజయ్ ఆంటోనీ యూట్యూబ్‌లో విడుదల చేశారు. జయలక్ష్మిని వెతకడమంటూ వచ్చే ఈ ఓపెనింగ్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్ళేలానే ఉంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే కట్టిపడేసేలా ఉంది. మొదటి పది నిమిషాలను ఇలా విడుదల చేయడమనే విజయ్ చేసిన సాహసానికి అభిమానుల దగ్గర్నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రదీప్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించారు.

మొదటి పది నిమిషాల సన్నివేశాలను ఇక్కడ చూడొచ్చు.

 
Like us on Facebook